శ్రీమంతుడు కథ పై కొత్త విషయం – సినీ పెద్దలు అంత పని చేశారా ? New Information came Out In Srimanthudu story case : What Movie Officials Did In ఠిస్ Incident

Telangana high court koratala siva శ్రీమంతుడు కథ పై కొత్త విషయం - సినీ పెద్దలు అంత పని చేశారా ? New Information came Out In Srimanthudu story case : What Movie Officials Did In ఠిస్ Incident

శ్రీమంతుడు(Sreemanthudu) సినిమా స్టోరీ తనదేనని శరత్ చంద్ర అనే రచయిత మీడియా ముందుకి వస్తే మొదట్లో దానిని ఎవ్వరు సీరియస్ గా తీసుకోలేదు, కానీ అయన ఆ విషయం లో న్యాయపోరాటం చేశాడు. దర్శకుడు కొరటాల శివ శ్రీమంతుడు సినిమాను తానూ రాసుకున్న చచ్చేంత ప్రేమ అనే నవలను ఆధారంగా చేసుకుని తీశారని అన్నారు. ఈ నవల 2012 సమయం లో స్వాతి వీక్లి లో వచ్చిందని కూడా గుర్తుచేశారు. ఆతరువాతే 2015 లో శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయిందని అన్నారు.

డైరెక్టర్ సముద్రను సాలిసిన రచయిత : Writer met Director Samudra

ఈ కథను సినిమా గా చేస్తే బాగుంటుంది అనిపించి తాను దర్శకుడు సముద్రను సంప్రదించానని అన్నారు. సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగానే శ్రీమంతుడు రిలీజ్ అయిపోయిందని, ఆ సినిమా చుసిన తన ఫ్రెండ్స్ అది అచ్చం నీ నవల లోని కథ మాదిరిగానే ఉందని చెప్పారన్నారు. తన ఫ్రెండ్స్ చూపిన మాట విని స్టన్ ఐపోయానని అన్నారు శరత్ చంద్ర. ఈ విషయం గురించి దర్శకుడు కొరటాలను కలవగా అయన వద్ద నుండి సానుకూల స్పందన రాలేదని చెప్పారు. అందుకే న్యాయ పోరాటం మొదలు పెట్టానని పేర్కొన్నారు.

రచయిత శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పు : Judgment in favor of author Sarat Chandra

రచయితా శరత్ చంద్ర ఈ విషయంలో మొదట నాంపల్లి కోర్టు లో వ్యాజ్యం వేశారు, కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం కొరటాల శివ పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది, దీంతో డైరెక్టర్ కొరటాల తెలంగాణ హైకోర్టు కు వెళ్లారు, అనూహ్యంగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కూడా శరత్ చంద్రకే అనుకూలంగా తీర్పును ఇచ్చింది. మనిషి ఆశాజీవి కాబట్టి, కొరటాల ఎదో ఒక చిన్న ఆశతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించాడు, కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది కొరటాలకు. దేశ అత్యున్నత న్యాయస్థానం క్రింది కోర్టుల తీర్పులనే సమర్ధించాయి.

బేరం కుదిర్చిన మాట వాస్తవమేనా ?

ఇక్కడే ఒక ఆశక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది, శరత్ చంద్ర న్యాయ పోరాటం చేస్తున్న సమయంలో ఇండస్ట్రీ పెద్దలు కొందరు కలుగజేసుకుని సంధి కుదిర్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అందుకు శరత్ చంద్రకు 15 లక్షల రూపాయల డబ్బు కూడా ఇవ్వజూపారట. కానీ రచయితా శరత్ చంద్ర న్యాయపోరాటం చేయడానికే నిశ్చయించుకున్నారు. ఒక రచయితగా తానూ డిమాండ్ చేసేది ఒక్కటే అంటున్నారు. తనకు డబ్బు ముఖ్యం కాదని ఆ కథ శరత్ చంద్రదే అని అంగీకరిస్తే చాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.

Leave a Comment