New Movies Coming For Sankranti: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అంత సందడి దేశంలోనే మరే ఇతర పండుగకి ఉండదేమో, ఎందుకంటే సంక్రాంతి అంటే కళకళలాడే లోగిళ్లు, సంక్రంతి అంటే రంగవల్లులు గొబెమ్మలు,
సంక్రాతి అంటే కొత్త అల్లుళ్లు అత్తవారింటి మర్యాదలు, సంక్రాతి అంటే కొంటె మరదలు, సంక్రాతి అంటే కమ్మని నోరూరించే పిండివంటలు, సంక్రాంతి అంటే జూదరత్నలకు మహపసందైన కోడిపందాలు వీటన్నిటికీ మించి అన్ని వర్గాల
వారిని అలరించే కొత్త సినిమాలు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకుంటారు. సంక్రాతి అనేది పుష్పకవిమానం వంటిది ఎన్ని సినిమాలు ఈ పండుగ నాడు రిలీజ్ కి వచ్చినా అందరికి చోటుంటుంది.
అందరికి థియేటర్లు దొరుకుతాయి. కాబట్టి చక్కగా క్యాష్ చేసుకోవాలె గాని సంక్రాంతి నిర్మాతలకు మహదావకాశం అని చెప్పాలి.
మరి ఈ సంక్రాంతికి ఏయే సినిమాలు వస్తున్నాయి, అందులో సీనియర్లు ఉన్నారా, కుట్ర్రా హీరోలు ఉన్నారా అని ఒక్కసారి చూద్దాం.
గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో Gunturu kaaram Movie
టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు(mahesh Babu) ఈ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడు. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల(Srileela) నాయికగా నటించింది.
ఇప్పటికే మహేష్ త్రివిక్రం కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. హిట్లు ప్లాప్ తో సంబంధం లేకుండా అతడు, ఖలేజా(Khaleja) బాగా అలరించాయి.
అయితే ఈ మధ్య కాలంలో మంచి జోరు మీదున్న మహేష్ త్రివిక్రమ్ లు కలిసి బ్లాక్ బస్టర్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా లో త్రివిక్రమ్ మార్క్ స్టార్ కాస్టింగ్ కనిపిస్తోంది.
అతని గత చిత్రాల్లో ఉన్న ఈశ్వరి రావు(Eswari Rao), జగపతిబాబు(Jagapathi Babu), ప్రకాష్ రాజ్, ఇందులో కూడా కనిపిస్తారు. రమ్య కృష్ణ(Ramya Krishna) కూడా ఈ సినిమాలో వారికి తోడయ్యింది.
ఎస్.ఎస్ థమన్(SS Thaman) అందించిన సంగీతం యువతను ఆకట్టుకుంది, మహేష్ మరోసారి మాస్ బీట్ సాంగ్ కి స్టెప్పులేసి వావ్ అనిపించాడు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ పథకం పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు.
జనవరి 12న థియేటర్లలోకి వస్తున్న గుంటూరు కారం ఘాటు ఆస్వాదించడానికి మహేష్ ఫాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సైంధవ్ తో వెంకీ – Venkatesh As Saindhav
సంక్రాంతికి చిన్నోడు వస్తే పెద్దోడు రాకుండా ఉంటాడా ? అందుకే ప్రిన్స్ మహేష్(Mahesh babu) తోపాటు విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా సంక్రాంతి బరిలోకి వచ్చేస్తున్నాడు.
సైంధవ్(Saindhav) సినిమాతో ఈ సరి వెంకీ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. పైగా ఈ సంక్రాంతి ఈ సైంధవ్ సినిమా వెంకీకి చాలా స్పెషల్ ఎందుకంటే ఇది వెంకీకి 75 వ సినిమా.
ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా ఇష్టుడైన వెంకీని డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) యాక్షన్ త్రిల్లర్ లో చూపించబోతున్నాడు. జనవరి 13వ తేదీన ఈ సినినిమా థియటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ(Navajuddin Sidhiki), తమిళ హీరో ఆర్య(Arya) కీలక పాత్రలలో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్(సంతోష్ Narayan) స్వరాలూ అందించిన ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించారు.
నాసామిరంగా అంటున్న నాగ్ : Nag Coming With Naasamiranga
ఒకప్పుడు సంక్రాంతికి వాసివాడి తస్సాదియ్యా అని మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగించిన టాలీవుడ్ మన్మధుడు ఈసారి నాసామిరంగా సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిపోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు ట్రైలర్ల దెబ్బకి సుర్రు సుమ్మయిపోతోంది. ఈ సినిమా కోసం నాగ్(Nagarjuna) నృత్య దర్శకుడిని సినిమా దర్శకుడిగా మార్చారు.
విజయ్ బిన్నీ(Vijay Binni) మెగా ఫోన్ పట్టి నాగ్ ను డైరెక్ట్ చేశాడు. అల్లరి నరేష్(AllariNaresh) కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో నాగ్ సరసన ఆషిక రంగనాధ్(Ashika Rabganath) ఆడిపాడింది.
అయితే ఇది నేరుగా తీసిన తెలుసు సినిమా కాదు మలయాళ సినిమా కి రీమేక్ ఇది, పోరంజు మరియం జోసే(Poranju Mariyam Jose) సినిమా ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలచారు.
ఈ సినిమాపై నాగ్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నాగ్ కి తప్పకుండ హిట్ ఇస్తుందని నమ్మకం తో ఉన్నారు. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా కి ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతాన్ని సమకూర్చారు, శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.