లిక్కర్ స్కామ్ లో కొత్త పేరు | ఎవరు ఈ మేకా శరన్

WhatsApp Image 2024 03 23 at 3.50.33 PM లిక్కర్ స్కామ్ లో కొత్త పేరు | ఎవరు ఈ మేకా శరన్

తీగ లాగితే డొంక మొత్తం కదిలింది అన్నట్టు, ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసు ఇప్పటికే రోజుకొక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(BRS MLC Kavita) సమీప బంధువైన మేక శరణ్(Meka Sharan) కి కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని, అయన కూడా ఇందులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గతవారం వారం కవిత ఇంట్లో సోదాలు జరిపి ఆపిదప ఆమెను ఈ డీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెను అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ కూడా అక్కడే ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేకా శరన్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారట. ఈ నేపథ్యంలో అధికారులు సరైన ఆధారాలు దొరకపుచ్చుకునేనేందుకు ఏ ఒక్క మార్గాన్ని వదలదలుచుకోలేదు. మర్చి 23వ తేదీన ఉదయం నుంచి హైదరాబాద్‌లోని(Hyderabad) కవితకు చెందిన బంధువులు, సన్నిహితుల నివాసాలను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. కొండాపూర్‌లోని మేక శరణ్, మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల నివాసల్లూ సోదాలు నిర్వహిస్తున్నారు.

WhatsApp Image 2024 03 23 at 3.49.47 PM లిక్కర్ స్కామ్ లో కొత్త పేరు | ఎవరు ఈ మేకా శరన్

బంధువుల పాత్ర ? Relatives Role ?

ఇక మేక శరణ్‌ విషయానికి వస్తే ఇదివరకే అతడిని రెండుసార్లు ఈడీ విచారణకు పిలిచింది. అయినప్పటికీ శరన్ గైర్హాజరయ్యారు. సౌత్ లాబీ లావాదేవీల్లో అతను కీలకపాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపుల వ్యవహారంలో బంధువుల పాత్ర ఎంతవరకు ఉంది అనేదానిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నిందితులు షెల్ కంపెనీల ద్వారానే లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ప్రస్తుతానికి ఈడి మొత్తం ఏడుగురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

Leave a Comment