New rules on SIM cards: సిమ్ కార్డుల నిబంధను వెల్లడించిన కేంద్రం.
మన లైఫ్ లో ఎన్నో పనులతో ఎంత బిజీ గా ఉంటాం. మనం చేయాలనుకున్న ఇంపార్టెంట్ పనులు కూడా ఒకొక్కసారి మర్చిపోతూ ఉంటాం..కానీ,ఒక వస్తువును మాత్రం మర్చిపోము..
అదేమిటో తెలుసా? అదేనండి.. మీ సెలఫోన్…దీనిలో కొత్త సిమ్ కార్డులు కొని వెయ్యాలనుకుంటున్నారా? అయితే, ఈ సమాచారం మీ కోసమే….
కొత్త సిమ్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నూతన నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి..
ఇంతకీ ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందామా:
ప్రతి ఇంట్లో కనీసం రెండుకు మించి ఫోన్లు ఉంటున్నాయి. వారి అవసరాలు సైతం అలాగే ఉన్నాయి! సినిమా టికెట్ నుంచి రైల్వే, విమాన టికెట్ దాకా.. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ దాకా.. అన్ని సేవలూ మొబైల్ కేంద్రంగానే సాగుతున్నాయి.
ఇక ఆధార్ నుంచి.. పాన్ కార్డ్ దాకా.. ప్రతి గుర్తింపు కార్డుకూ.. మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సిందే. అందుకే, ఇంతటి కీలకమైన సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో ఇష్టానుసారంగా సిమ్ కార్డులు కొనుక్కోవడానికి వీలు ఉండేది. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు నిబంధనల్ని కఠినతరం చేసింది.
డిసెంబర్ 1, 2023 నుంచే దేశంలో SIM కార్డ్ నిబంధనలు మారిపోతున్నాయి. సిమ్ కార్డు విక్రయాల్లో సేఫ్టీ, సెక్యూరిటీని పెంచడం కోసం దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నకిలీ సిమ్ కార్డుల మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ అరికట్టదానికి
కేంద్ర టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిబంధనల ప్రకారంఒక వ్యక్తి ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని పొందేందుకు అర్హత ఉంటుంది.
ఎవరి సిమ్ కార్డు సేవలనైనా పూర్తిగా నిలిపివేస్తే.. 90 రోజుల వ్యవధి తర్వాతే ఆ నంబర్ మరొక వ్యక్తికి ఇస్తారు.కస్టమర్లు సిమ్ కార్డుల్ని కొనుగోలు చేసే సమయంలో.. ఆధార్ స్కానింగ్ సహా డెమోగ్రాఫీ డేటా తప్పని సరిగా సేకరిస్తారు..