New SCAM Phone call with the name of Naya Samam Aid with Aadhaar card : ఇటీవల చెన్నై వివాహిత కు ఒక ఫోన్ కాల్ చచ్చింది అందులో సారాంశం ఇలా ఉంది. మీరు మీ ఆధార్ కార్డు తో ధాయ్ లాండ్ కు ఒక పార్సిల్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి, మీ మీద కేసు ఫైల్ చేసాము. మీరు ఇబ్బందులలో పడకుడా ఉండాలంటే మేము మీకు ఓ రకం గా సహాయం చెయ్యగలం అని చెప్పాడు.
మేము ఒక లింక్ పంపుతాము ఆ లింక్ ద్వార మా ఆధార్ కార్డు దుర్వినియోగం జరిగింది అంటూ కంప్లైంట్ చెయ్యాలని చెప్పాడు. అయితే తనకి తెలిసిన ఒక ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడించి మీ మీద కేసు లేకుండా చేస్తాను అని చెప్పాడు.
ముందు తాను చెప్పినట్టు చెయ్యమని ఆ లింక్ మీద క్లిక్ చెయ్యమని ఫోర్సు చేసాడు. తాను గతం లో ఒకసారి హైదరాబాద్ కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయిని ఇలాగే చేసి 12 లక్షలు కాజేసాడు అని తెలిసి తాను ఆ లింక్ మీద క్లిక్ చెయ్యకుండా ఫోన్ కాల్ కట్ చేసానని చెప్పింది. అయితే ఫోన్ కాలర్ చెప్పిన తన వివరాలు విని ఆశ్చర్య పోయానని తనకి సంబందించిన అన్ని వివరాలు కూడా చెప్పాడని ఆమె తెలిపింది.
అయితే స్కామర్ పంపిన లింక్ లు అచ్చు గుద్ది నట్లు బ్యాంక్ లకు అలాగే పోలీస్ శాఖ కు సంబందించినవి గానే ఉన్నాయని ఎవ్వరు చుసిన వెంటనే ఆ లింక్ లు మీద క్లిక్ చేస్తారని అలా వాటిని తయారుచేసాడని ఆమె చెప్పింది. దయచేసి మీ ఫోన్ కి ఎటువంటి లింక్ లు వచ్చిన వాటిని అస్సలు పట్టించుకోవద్దు అని ఆమె చెప్పింది.
మీకు అనుమానం ఉంటే వెంటనే సైబర్ సెల్ కి కాల్ చేసి చెప్పాలని ఆమె చెప్పింది. తాను అలాగే చేసానని చెప్పింది.