New Zealand won the toss world cup 2023 : టాస్ గెలిచిన న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచినా లంకేయులకు కివీస్ కు కీలకంగా మరీనా మ్యాచ్.
క్రికెట్ ప్రియులంతా ప్రస్తుతం ఎక్కడ ఉన్న ఏ పని చేస్తున్నా అనుక్షణం చూసుకునేది స్కోర్ బోర్డు. ఖాళి సమయం దొరికితే చాలు, మన ఇండియా ఆడుతున్నా లేకపోయినా సరే టీవీలకు అతుక్కుపోయి క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు కొందరు. ఇక ఇవాళ న్యూజిలాండ్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కివీస్ గనుక ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే వరల్డ్ కప్ ను చేజార్చుకున్న లంకేయులు ఈ మ్యాచ్ లో నెగ్గితేనే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే వీలుంటుంది. చాలా ఆశక్తిగా మారిన ఈ మ్యాచ్ బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది.
శ్రీలంక తరుపున పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక ఆడుతున్నారు.
అలాగే న్యూజిలాండ్ తరుపున డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఆడుతున్నారు. ఈమ్యాచ్ లో టాస్ గెలిచినా న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.