రాబోయే 7 రోజుల్లో 5 రోజుల పాటు రాత్రి వేళల్లో ఆకాశంలో కనువిందు.

website 6tvnews template 10 1 రాబోయే 7 రోజుల్లో 5 రోజుల పాటు రాత్రి వేళల్లో ఆకాశంలో కనువిందు.

రాబోయే 7 రోజుల్లో 5 రోజుల పాటు రాత్రి వేళల్లో ఆకాశంలో కనువిందు : నేటి నుండి సరిగ్గా రాబోయే 7 రోజుల్లో ఐదు రోజుల పాటు ఆకాశంలో అద్భుతం జరుగబోతోందని ప్లానెటరీ సోసైటీ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు రాత్రి నుండి ఆకాశం నుంచి నేల రాలే ఉల్కా పాతాలను ప్రజలు నేరుగా వీక్షించ వచ్చని కూడా ప్లానెటరీ సోసైటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేరు వేరు సమయాల్లో ఈ కాంతివంతమైన ఉల్కాపాతాలను అందరు చూడవచ్చు. పాథియాన్‌ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో కొద్ది నెలల కిందట దారి తప్పి భూ కక్ష్యలోకి ప్రవేశించిందని అందువల్ల ఇది ఇతర పదార్థాలతో రాపిడికి గురై ఉల్కలుగా పడుతుందని వారు చెప్పారు.

ఉల్కలు నేల రాలే సమయంలో గంటకు 150 కాంతిపుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్న వారందరికీ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని ప్లానెటరీ సోసైటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

వాటిని చూసిన వారు ఫొటోలు, వీడియోలు తీసి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని కూడా చెప్పింది.

Leave a Comment