No Benefit For tax Payers In New Budget : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetaaraman) ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటు లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై ఆమె దగ్గరదగ్గరగా ఒక గంట పాటు ప్రసంగాన్ని వినిపించారు.
2024 – 25 మధ్యంతర బడ్జెట్ పై ఆదాయ పన్ను చెల్లించేవారు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి.
టాక్స్ పేమెంట్ లో కొత్త విధానాలు తీసుకొచ్చామని కేంద్రం చెప్పుకొచ్చినప్పటికీ పాత విధానంతో పాలిస్తే మార్పులేమీ కనిపించలేదని పెదవి విరిచారు టాక్స్ పేయర్స్. కొత్త విషాణంలో 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదని చెప్పారు, అయితే దానిని 8 లక్షలకు పెంచుతారని అంతా భావించారు, కానీ ఆ ప్రకటన ఊసే లేకపోవడంతో పన్ను దారులు నీరసించిపోయారు.
అప్పు ఎన్ని లక్షల కొట్లో తెలుసా ? Do you know how many Crores of debt?
ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల రూపాయల నుండి 75 వేల రూపాయలకు పెంచగా, కార్పొరేట్ టాక్స్ ను మాత్రం 30 శాతం నుండి 22 శాతానికి కుదించారు. అంటే 8 శతం తగ్గించారు.
ఫిజికల్ డెఫిసిటీ ని 5.2 శాతానికి తగ్గించడానికి కూడా కారణాన్ని చెప్పారు నిర్మల, ఈ ఏడాది 26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనాగా ఉందని అదే దీనికి కారణమని అన్నారు. 2023 – 24 కి సంబంధించిద్రవ్య లోటు 5.8 శాతం అని అలాగే రెవెన్యూ ఆదాయం చూస్తే 30.08 లక్షల కోట్లు మన దేశం ఆర్జించిందని అన్నారు.
ఇక అప్పులు విషయం కూడా చెప్పుకోవాలి కాబట్టి, 2023 – 24 లో మనదేశం అప్పు 14 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు. 2024-25 కి సంబంధించి ఓట్ ఆన్ బడ్జెట్(Vote On Budjet) కింద మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్త 46.77 లక్షల కోట్లు అని తెలుస్తోంది.