ఏ కార్డు అవసరం లేదు 10 లక్షలు వరకు ఉచిత వైద్యం – CM రేవంత్ రెడ్డి

website 6tvnews template 2024 03 13T152043.195 ఏ కార్డు అవసరం లేదు 10 లక్షలు వరకు ఉచిత వైద్యం - CM రేవంత్ రెడ్డి

No card required Free medical treatment up to 10 lakhs – CM Revanth Reddy : తెలంగాణా రాష్ట్రం లో నిరు పేదలకు ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ఉచిత వైద్యం లభిస్తున్న విషయం అందరికి తెలుసు.

ఇదివరకు ఈ పధకం ద్వారా 5 లక్షలు వరుకు పేదలకు ఉచిత వైద్యం అందేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆరోగ్య శ్రీ పధకం పరిమితిని 10 లక్షలకు పెంచింది.దీనికి ఆరోగ్య శ్రీ కార్డు లేదా రేషన్ కార్డు ఉన్నవారు ఆ పధకానికి అర్హులు గా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఈ మధ్య కాలం లో చాలా మంది పెళ్లి చేసుకోవడం తదనంతరం విడిపోవడం, అలా ఏర్పడిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లు రాకపోవడం తో అర్హులైన వారు చాలా మంది ఈ పధకాన్ని వినియోగించలేక పోతున్నారు.

దీని వల్ల నిజం గా అర్హులైన అభ్యర్దులకు లెడ్ నిరు పేదలకు ఈ లక్షల విలువ చేసే వైద్యం అందక పోవడం వల్ల వారు చాలా నష్ట పోతున్నారు. ఈ ఆరోగ్య శ్రీ కార్డు కాని రేషన్ కార్డు కాని లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎంతో నష్ట పోతున్నారు.

వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని CM రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ కార్డు తో నిమిత్తం లేకుండా నిరుపేదలకు ఆరోగ్య శ్రీ పధకం క్రింద 10 లక్షలు వరకు ఉచిత వైద్యం అధించాలని ఆదేశించారు.

అందుకు అవసరమైన గైడ్ లైన్స్ తయారు చేసి వీలైంత త్వరగా రిపోర్ట్ లు అందజేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టమని ముఖ్యమంత్రి చెప్పారు

Leave a Comment