ఇక మెట్రో టికెట్ వాట్స్ అప్ నుండి బుకింగ్ చేసుకోండి

How to book Delhi Metro tickets using WhatsApp 1 ఇక మెట్రో టికెట్ వాట్స్ అప్ నుండి బుకింగ్ చేసుకోండి


హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక చాల వరకు ట్రాఫిక్ సమస్యలు తీరినట్లే చెప్పవచ్చు. ఒకానొక సమయం లో గంటల కొద్ది బస్ ల కోసం వెయిట్ చేసి తీర ఆ బస్సు ఎక్కాక గమ్య స్దానానికి ఎప్పుడు చేరుకుమ్తామో తెలియని పరిస్థితి. ఈ మెట్రో సేవలు కూడా అందుబాటులోకి వచ్చాక టికెట్ తీసుకోవడానికి గంటల సమయం వెయిట్ చేయాల్సిన పని లేదు. టెక్నాలజీ ఉపయోగిస్తూ మరెంత సౌకర్యం గా టికెట్ తీసుకోవడానికి మరిన్ని చర్యలు చేపడుతోంది హైదరాబాద్ మెట్రో. ఇప్పుడు మీరు ఉన్న చోట నుండే మెట్రో టికెట్ పొందడానికి ఒక కొత్త సౌకర్యం తీసుకొచ్చింది మెట్రో. మీ మొబైల్ లో వాట్స్ అప్ ద్వారా మీరు ఎక్కడ నుండి ఎక్కడ వరకు టికెట్ కావాలనుకొంటున్నారో మీ మొబైల్ ద్వార పొందవచ్చు.

1.దీనికి మీరు చేయాల్సింది ఒక్కటే మీ మొబైల్ లో 918341146468 ఈ నెంబర్ ని సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మీ వాట్స్ అప్ నుండి ఈ నెంబర్ కి HI అని మెస్సేజ్ పంపండి

2.అలా పంపగానే ఒక OTP తో పాటు టికెట్ బుకింగ్ కు కోసం ఒక URL గేట్ వే ఓపెన్ అవుతుంది

3.ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేయ్యగానే డిజిటల్ గేట్ వే web page ఓపెన్ అవుతుంది

4.అప్పుడు మీరు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో ఆ వివరాలు ఎంటర్ చేసి దానికి అయిన టికెట్ డబ్బులు గూగుల్ పే కాని ఫోన్ పే కాని డెబిట్ కార్డు కాని ఉపయోగించి మనీ పే చెయ్యాలి

5.మని కట్టినట్లు మెస్సేజ్ రాగానే మీ వాట్స్ అప్ కు ఈ టికెట్ కి సంబందించిన URL వస్తుంది

6.ఈ URL ని డౌన్ లోడ్ చేసుకుని మెట్రో స్టేషన్ కి వెళ్ళి అక్కడ బోర్డ్ లో ఉన్న QR CODE ని స్కాన్ చేస్తే మీకు టికెట్ వస్తుంది. ఈ టికెట్ ని 24 గంటల లోపు వాడుకోవాలి.

Leave a Comment