‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ప్లాన్ ఇదే

website 6tvnews template 2024 03 06T115702.129 'వార్ 2' తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ప్లాన్ ఇదే

NTR mind blowing bollywood plans : ఆర్ఆర్ఆర్ (RRR)తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నార్త్ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకున్నాడు. తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. దీనితో యంగ్ టైగర్ కు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చింది.

ఫస్ట్ టైం తారక్ ‘వార్ 2′(War2)తో స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ మూవీలో హృతిక్ రోషన్ (Hritik Roshan)లీడ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇంతకుముందే వచ్చిన ‘వార్’లో హృతిక్ తో పాటు యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)కూడా నటించాడు. అయితే… క్లైమాక్స్ లో మాత్రం ఆయన క్యారెక్టర్ కు ఎండ్ కార్డ్ వేశారు.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ పాత్రకు ‘వార్ 2’ ఎండింగ్ లో శుభం కార్డు వేస్తారనే టాక్ సినిపిస్తోంది. అయితే అందులో నిజం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

యశ్ రాజ్ స్పై యూనివర్స్‎లో ఎన్టీఆర్ :

యశ్ రాజ్ ఫిల్మ్ కు బాలీవుడ్ లో ఓ బ్రాండ్ ఉంది. ఈ బ్యానర్ పై ఇప్పటి వరకు ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ లో వసూళ్లను కొల్లగొట్టాయి. లేటెస్టుగా ఈ స్పై యూనివర్స్ లో ‘వార్ 2′(War2) తెరకెక్కుతోంది. అంతకు ముందు ‘ఏక్ థా టైగర్’ (Ek Tha Tiger), ‘టైగర్ జిందా హై’ (Tiger zind Hey), ‘వార్'(War), ‘పఠాన్’ (Pataan), ‘టైగర్ 3’ (Tiger2) వంటి మూవీస్ ను బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ (Salman Khan), హృతిక్ రోషన్ (Hritik Roshan), షారుఖ్ ఖాన్ (Sharuh Khan)పాత్రలను బేస్ చేసుకుని యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films)రైటర్ ఆదిత్య చోప్రా(Aditya Chopra) సినిమాలు తీస్తున్నారు .

అదే విధంగా ‘వార్ 2’లోనే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ బేస్ చేసుకుని మరిన్ని స్పై సినిమాలు చేయాలని ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నారట. అందులోనూ గెస్ట్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది.

‘వార్ 2’లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇదే :

‘వార్ 2′(War2)లో ఎన్టీఆర్ ఇండియన్ స్పై ఏజెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారట. హృతిక్ రోషన్ (Hritik Roshan), ఎన్టీఆర్ (NTR)కు మధ్య ఉండే కీలకమైన సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ మాత్రం నెల రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం ఇండిపెండెన్స్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీని ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఫేమ్ అయాన్ ముఖర్జీ (Ayaan Mukharji)డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వానీ (Kiara Advani)నటిస్తోంది. అయితే ‘వార్ 2’ కంటే ముందే ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ (Devara) మూవీ రిలీజ్ చేయాలని డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

Leave a Comment