NTR Tweet Viral: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన నటన, అంకితభావం, డ్యాన్సింగ్ టాలెంట్‌తో కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ బాలీవుడ్ న్యూ కమర్స్‌కు లా ప్రేరణ అందిస్తున్నారు.
ప్రతి సినిమాలో తన పాత్రలో , నటనలో వేరియేషన్స్ చూపిస్తూ అభిమానులను నిత్యం ఆశ్చర్యపరుస్తూ వారికి ఫేవరేట్ స్టార్‌గా ఉంటున్నారు.
హృతిక్ రోషన్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ వార్ 2 (War2) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుట్టిన రోజు (Birthday) సందర్భంగా హృతిక్‌కి చాలా మంది సెలబ్రిటీలు,
సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) హృతిక్ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్2 (war2) మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి అందరి దృష్టి దీనిపైనే పడింది. మొదట హిందీ సినిమా అని అంతా లైట్‌గా తీసుకున్నా ఎన్టీఆర్ (JR.NTR) వార్2లో ఉన్నాడన్న విషయం తెలియడంతో క్రేజ్ మరింతగా పెరిగింది.
హృతిక్ (Hrithik Roshan),ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రమే కాదు యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films)బ్యానర్ లో వస్తున్న అతి భారీ చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అని తెలుస్తోంది.
ఎన్టీఆర్-హ్రితిక్ ల కాంబినేషన్ కి ఇక బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan) , కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) క్యామియో కూడా కలిస్తే ఇక బొమ్మ అదుర్సే అని అంటున్నారు ఫ్యాన్స్.
Happy Birthday @iHrithik sir… Wishing you an amazing one and a year full of good vibes. Big cheers to Fighter!
— Jr NTR (@tarak9999) January 10, 2024
ఇక ఇదిలా ఉంటే ఈరోజు హృతిక్ రోషన్ పుట్టినరోజు కావడంతో… జూ.ఎన్టీఆర్ ట్విటర్ లో ఆయనకు స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే హృతిక్ సర్… బిగ్ చీర్స్ టు ఫైటర్’
అని ఆయన ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. యుద్ధభూమిలో ఎన్టీఆర్,
హృతిక్ రోషన్ తలపడితే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఎవరికి వారు వార్ 2కి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ పుట్టినరోజున హృతిక్ రోషన్, యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తా అంటూ ట్వీట్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు.
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2 (war2). యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ స్పై యూనివర్స్‌లో రూపొందుతున్న ఆరో సినిమాగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
వార్ 2లో హృతిక్ రోషన్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ వార్ గా సోషల్ మీడియాలో ఈ మూవీని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. వార్ 2లో హృతిక్ కబీర్ సింగ్ గా కినిపించనుండగా, అతని ప్రత్యర్థి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
బ్రహ్మాస్త్రతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2ను పక్కన పెట్టి మరీ స్పెషల్ ఇంట్రెస్ట్ తో వార్ 2 మూవీ చేస్తున్నాడు.
దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ ఏ లెవెల్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వార్ 2 అనౌన్స్మెంట్ తోనే బాలీవుడ్ లో విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.
వార్ 2కి నాలుగు రోజుల వీకెండ్ దొరికింది. ఈ మూవీకి టాక్ కనుక పాజిటివ్ గా వస్తే మాత్రం దెబ్బకి బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. రికార్డుల మోతమోగాల్సిందే.
ఇప్పటివరకూ మన దక్షిణాది సినిమాలు నార్త్ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టాయి. కానీ వార్ 2లో ఎన్టీఆర్ ఉండటంతో ఈసారి సౌత్ లో కూడా నార్త్ మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఖాయంగా తెలుస్తోంది.