Jr. NTR reaction on Japan earthquake: జపాన్ భూకంపం పై ఎన్టీఆర్ స్పందన.

NTR's reaction on Japan earthquake.

Jr. NTR reaction on Japan earthquake: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) జపాన్ భూకంపం గురించి స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ గత వారం రోజులుగా జపాన్ లోనే ఉన్నాడు.

తాను జపాన్(japan) నుండి హైదరాబాద్ కి(Hyderabad) తిరిగి వచ్చిన అనంతరం అక్కడ ఘోరమైన భూకంపం సంభవించిన విషయం తెలుసుకున్న జూనియర్ దానిపై స్పందించారు.

జపాన్ లో భూకంపం సంభవించిన విషయం తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పాడు. వారం రోజుల పాటు తానూ జపాన్ లోనే గడిపానని, అక్కడి ప్రజలు ఎవరైతే ఈ భూకంపం వల్ల ప్రభావితం అయ్యారో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియకేస్తున్నాని అన్నాడు.

అంతేకాక వారు త్వరగా కోలుకోవాలని, వారికి మనోధైర్యం కలగాలని చెప్పాడు. జపాన్ ప్రజలు దృఢంగా ఉండాలని తానూ కోరుకుంటున్నట్టు వెల్లడించాడు. జపాన్ ప్రజల క్షేమాన్ని తాను కాంక్షిస్తానని తన హృదయం అక్కడి ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటుందని పేర్కొన్నాడు.

ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. కళ్యాణ్ రామ్(kalyan Ram) ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నారు.

జపాన్ భూకంపం తీవ్రత : Severity of Japan Earthquake

ఇక జపాన్ భూకంపం విషయానికి వస్తే అక్కడ డిసెంబర్ ఒకటవ తేదీన 7.6 తీవ్రతతో భూ కంపం సంభవించింది. ఈ ప్రక్రుతి ప్రకోపం ధాటికి వాజిమా అనే ప్రాంతంలో రోడ్లు బీటలు వారాయి,(Roads damage) కొన్ని నివాసగృహాలు నేలమట్టం అయ్యాయి,

పెద్ద పెద్ద భవనాలు ఊగిపోయాయి. భూమి కంపిస్తున్న సమయంలో ప్రజలు భయకంపితులయ్యారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్ళనుండి బయటకు పరుగులు తీశారు.

భూ కంపెనీకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇళ్లలో ఉన్న వస్తులువు, పార్కింగ్ లో ఉన్న కార్లు ఊగిపోతూ కనిపించాయి.

ఈ భూకంపం అనంతరం హోక్కాయిడో(Hokkaido) నుంచి నాగసాకి(Nagasaki) వరకు సునామి(Tsunami) వచ్చే సూచనలు కూడా ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.

అయితే సునామి ప్రమాదాలు జపాన్ ను వెంటాడకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సునామి హెచ్చరికల నేపథ్యంలో సాగర తీరాన ఉన్న ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు చేసురుకున్నారు.

ఇక ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టమే కానీ ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతం లో దాదాపు 36 వేల ఇళ్ళకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Leave a Comment