Numaish-2024 Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్.

Numaish in Nampally Exhibition Ground.

Numaish-2024 Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Ground) ను 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌(Numaish) కోసం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ అద్భుత ప్రదర్శన జనవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు, అంటే 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఎగ్జిబిషన్ లో సుమారుగా 2400 కొలువుదీరనున్నాయి.

ఇక ఈ దఫా నుమాయిష్ ప్రెసిడెంట్‌ గా నిలిచే అవకాశం తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును(Duddilla Sridhar Babu) వరించింది.

ఈ విషయమై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సుమారు 80 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది మన భాగ్యనగరంలో నిర్వహించబడుతున్న ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి దేశంలోని అనేక ప్రాంతాల నుండి వర్తకులు తరలి వస్తారని అన్నారు.

చాలామంది వార్తలులు ఇప్పటికే ఈ ఎగ్జిబిషన్ లో తమ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని, సొసైటీ సభ్యులు వర్తకులకు సహకరిస్తున్నారని అన్నారు.

ఇక ఈ ప్రదర్శన సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

నుమాయిష్ టికెట్ ఎంతంటే : Numaish Ticket Pricing

ఈ ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర నలభై రూపాయలు(₹40) గా నిర్ణయించారు. ఇక ఈ ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించేలా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలు కల్పించారు.

కానీ వాహనాలలో ప్రదర్శన తిలకించాలి అనుకునే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించక తప్పదు. క్రితం ఏడాది ఈ తరహా సౌకర్యానికి నిర్వాహకులు 600(₹600) రూపాయలు వసూలు చేసేవారు.

ఇక సాధారణ సందర్శనకు సాయంత్రం 3.30 నిమిషాలనుండి రాత్రి 10.30 నిమిషాలవరకు అనుమతి ఉంటుంది.

ఇక ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను దృష్టిలో పెట్టుకుని రాయదుర్గం – నాగోల్(Rayadurgam – Nagol), మియాపూర్ – ఎల్బీ నగర్

(Miyapur – LB Nagar) మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడపనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ(TSRTC) నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

నుమాయిష్ ఎగ్జిబిషన్ తో వచ్చే ఆదాయాన్ని : Revenue from Numaish Exhibition

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Ground) లో ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించేందుకు లక్షల సంఖ్య లో ప్రజలు తరలి వస్తారు. దీని వల్ల పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

అయితే దీని వల్ల వచ్చే ఆదాయాన్ని మంచి పనులకు వినియోగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఒక సందర్భంలో తెలిపారు.

ఈ ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం లోని కొన్ని జిల్లాల్లో విద్యారంగ విస్తరణకు(Expansion of education) కృషి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం మహిళా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నీక్ కళాశాలలు

పిజి కళాశాలలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ కారణంగానే గతంలో పది రూపాయలు(₹10) ఉన్న ఎంట్రీ టికెట్ ను ఈ ఏడాది 40 రూపాయలు గా చేసినట్టు ఉన్నారేమో అని ప్రజలు భావిస్తున్నారు.

కరోనా తో జరా భద్రం : Stay safe with Corona

ఈ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు, అయితే ఈ ఆమధ్య కాలంలో కరోనా(Corona) విస్తరణ మరల పెరుగుతోంది.

కాబట్టి కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు తమ వంతు జాగ్రత్తలు పాటించడం కూడా తప్పనిసరి అని తెలుస్తోంది.

ఈ ప్రదర్శన తిలకించేందుకు వచ్చేవారు మాస్కులు(Face Mask) ధరించడం మంచిది, వీలైనంత వరకు ఆన్లైన్ పేయిమెంట్స్(Online Payments) చేస్తూ నగదు రహిత కొనుగోళ్లు విక్రయాలు చేయడం ఉంత్తమం.

సాంస్కృతిక కార్యక్రమాలు : Cultural events

ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను దుష్టిలో పెట్టుకుని సాంస్కృతిక కార్యక్రమాలను(Cultural Activities) కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్న చిన్న క్రీడా పోటీలు,

ఆహుతులను ఉత్సాహపరిచేందుకు వినోద కార్యక్రమాలు ఉండనున్నాయట. ఏది ఏమైనా సందర్శకులు ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు.

అందుకే ఎగ్జిబిషన్ లోపల అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ ఎగ్జిబిషన్ లోని వచ్చే ముందే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద సందర్శకులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తారు.

Leave a Comment