చివరి ఆయకట్టు గ్రామాలకు నీరు లేక పంటలు ఎండి పోతున్నాయని వెంటనే నీరు అందించి మా పంటలను కాపాడాలని సదర్ మట్ చివరి ఆయకట్టు గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. అంతే కాదు తమ నిరసన కార్యక్రమం చేపట్టి నిర్మల్, మంచిర్యాల నేషనల్ హైవె మీద కుర్చుని తమ నిరసన తెలియజేసారు. నిర్మల్ జిల్లా లోని కడెం మండలం లో ఉన్న పెద్దూరు, కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, లక్ష్మి సాగర్ ఈ గ్రామాలకు దాదాపు వారం రోజుల నుండి నీరు అందడం లేదని, దీని వల్ల పంటలు ఎండి పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయం లో రైతులు మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు కి సంబందించిన AE రవికుమార్ కొంత మంది రైతుల వద్ద డబ్బులు తీసుకుని వారికి నీటిని విడుదల చేస్తున్నట్లు వారు ఆరోపించారు. వెంటనే ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన తెలిపారు. దీనికి సంబందించిన అధికారులు వచ్చి మాకు తగిన హామీ ఇచ్చే వరకు మా ఆందోళన విరమించమని చెప్పారు.
ఇక చేసేది లేక కడెం ప్రాజెక్ట్ EE రామారావు ఆ ప్రదేశానికి వచ్చి రైతులతో మాట్లాడి పంట చివరి వరకు నీరుని విడుదల అయ్యేటట్లు చూస్తానని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమం లో భాగంగా 4 గ్రామాల రైతులు భారీ గా చేరుకున్నారు