కోతులు చనిపోయిన నీటినే తాగునీరు సరఫరా చేసిన అధికారులు – KTR కీలక వ్యాఖ్యలు !

website 6tvnews template 2024 04 04T150943.386 కోతులు చనిపోయిన నీటినే తాగునీరు సరఫరా చేసిన అధికారులు - KTR కీలక వ్యాఖ్యలు !

ఇటీవల నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ కి చెందిన హిల్‌ కాలనీలో దారుణ సంఘటన ఒక బయటకి వచ్చింది. మూతలేని వాటర్‌ ట్యాంకులో దాదాపు 30 కోతులు పడి పైకి రాలేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతే కాదు ఈ టాంక్ నుండే దాదాపు 200 ఇళ్లకు తాగునీరు సరఫరా అయ్యేలా ఈ ట్యాంకు నిర్మించడం జరిగింది. అంతే కాదు పైన రేకులు కుడా వేశారు.

అయితే ఈ మధ్యన ఎండలు బాగా పెరిగిపోవడం తో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దాదాపు 30 కోతులు అందులోకి దిగాయి. కాని వాటికి బయటకు వచ్చేందుకు దారి దొరక్కఫోవడం తో అందులోనే పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే కోతులు మరణించిన విషయాన్ని ఆలస్యం అంటే బుధవారం నాడు అధికారులు గుర్తించారు. అనంతరం ట్యాంకు లోంచి దాదాపు 30 కోతుల కళేబరాలను బయటకి తీసారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భాయాందోళనకు గురవుతున్నాయి. అంతే కాదు కోతులు చనిపోయిన దాదాపు 10 రోజులపైనే అయి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి అదే నీటిని తాగుతున్నామని వారు చెప్తున్నారు. వారికి ఎలాంటి రోగాలు వస్తాయో అని భయపడుతున్నారు. అయితే అధికారులు ఆ టాంక్ గురంచి అసలు పట్టించుకోవడం లేదని అలాగే ట్యాంకును శుభ్రం చేయడం లేదని స్థానికంగా ఉండే ప్రజలు ఆరోపిస్తున్నారు.

గత 3 రోజులుగా నీరు సరఫరా కాకపోవడం వల్ల అనుమానం వచ్చి ట్యాంకును చూడగా కోతుల విషయం బయటకి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు SE నాగేశ్వరరావు ఆ ట్యాంక్ నుండి కోతుల కళేబరాలను తీసి ట్యాంకును బాగా శుభ్రం చేయించామని చెప్పారు. దీని గురించే గత మూడు రోజులుగా నీటిని సరఫరా ఆపివేసామని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో ట్యాంక్ లో ఉన్న నీటిని పూర్తిగా క్లోరినేట్ చేసిన తర్వాత మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం 50 ఇళ్లకు మాత్రమే ఈ ట్యాంకు ద్వారా నీటి విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇక ఈ ఘటనపై మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ లో మున్సిపల్ శాఖలో చాల దరిద్రమైన పరిస్థితి ఉంది అంటూ అయన విమర్శించారు. కనీసం రోజు రెగ్యూలర్‌గా ట్యాంకులను శుభ్రపరచడం అనేది విధి నిర్వహణలో బాగమని అలాంటిది అసలు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కి ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల ఆరోగ్యం వారికి అవసరం లేదని ఆయన చాల ఘాటు గా విమర్శించారు.

Leave a Comment