అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్స్ ‘పుష్ప2’ (Pushpa2) సుకుమార్ (Sukumar ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
పుష్ప మొదటి భాగంలో బన్నీ యాక్టింగ్, ఫహద్ ఫాజిల్ (Fahad Fazil ) పెర్ఫార్మన్స్, రష్మిక మందన్న ( Rashika Mandanna) క్యూట్ నెస్ అందరిని బాగా ఆకట్టుకున్నాని. మరీ ముఖ్యంగా ఈ ఒక్క సినిమాతో బన్నీ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.
అంతేకాదు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని కూడా అందుకున్నాడు . సౌత్ లోనే కాదు నార్త్ లోనూ పుష్ప ఓ రేంజ్ లో దుమ్ము దులిపింది బాక్స్ ఆఫీస్ లో భారీ వసూళ్లను సాధించింది. సినిమా వచ్చి రెండు ఏళ్లు పూర్తవుతున్నా సెకండ్ పార్ట్ ఇంకా రిలీజ్ కాలేదు.
ఇప్పటికీ షూటింగ్ పనులు జరుగుతుండడంతో ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూవీ షూటింగ్ నిదానంగా సాగుతుండటంతో పాటు అప్డేట్స్ కూడా లేకపోవడంతో అభిమానులు ఫీల్. ఈ క్రమంలో మేకర్స్ పుష్ప 2 కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించింది.
ఆ సీన్ కోసం రూ.50 కోట్లు :
పుష్ప 2 నిర్మాణ బాధ్యతలను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తీసుకుంది దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారు . ఈ మధ్యనే ఈ మూవీకి సంబంధించి ఓ కీలక ఎపిసోడ్ షూట్ చేశారట.
ఇంటర్వెల్ ముందు వచ్చే జాతర ఎపిసోడ్ 30 నిమిషాల పాటు ఉంటుందట. ఈ అరగంట ఎపిసోడ్ ను మేకర్స్ దాదాపు 35 రోజుల షూట్ చేశారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కోసమే రూ.50 కోట్లకుపైనే ఖర్చు చేసినట్లు సమాచారం.
చేతులకు నెయిల్ పాలీష్, నుదుట బొట్టుతో అర్ధనారీశ్వరుడి గెటప్‌లో ఈ సీన్ లో బన్నీ కనిపిస్తాడట. ఓ సాంగ్ , భారీ ఫైట్, భావోద్వేగమైన సన్నివేశాలను మేళవించి సుకుమార్ (Sukunar) ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశాడట. ‘పుష్ప 2’ (Pushpa2) సినిమాలో ఇదే హైలెట్ సీన్ అని సమాచారం. థియేటర్స్ లో ఈ సీన్స్ కి ప్రేక్షకులకు పూనకాలు రావడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు.
అట్లీ, త్రివిక్రమ్ లతో సినిమాలు కమిట్ :
ఈ మధ్యనే జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్లో బన్నీ పుష్ప 3 ఉంటుందని ఓ ఆసక్తికరమైన అప్డేట్ అందించాడు. అయితే పుష్ప 3 సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో బన్నీ అట్లీ(Atlee ) త్రివిక్రమ్ (Trivikram) ,సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga) వంటి డైరెక్టర్స్ తో సినిమాలు కమిట్ అయ్యారని ఇండస్ట్రీలో టాక్.
అటు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ‘పుష్ప3’ సెట్స్ మీదకు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. ఇక పుష్ప 2 లో రష్మిక (Rashmika ) తో పాటు మలయాళం హీరో ఫాహాద్ ఫాజిల్(Fahad Fazil ), సునీల్ (Sunil ), అనసూయ (Anasuya) , జగదీశ్ బండారి ( Jagadesh bandari) వంటి తారలు తదితరులు కీలకపాత్రలుl పోషిస్తున్నారు.ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ (Devi sri prasad )సంగీతాన్ని స్వరపరుస్తున్నాడు.