Om Shanti Shanti Shanti – means?: ఓం శాంతి శాంతి శాంతి..అంటే ఏంటో తెలుసా?

Add a heading 2023 12 08T144048.454 1 Om Shanti Shanti Shanti - means?: ఓం శాంతి శాంతి శాంతి..అంటే ఏంటో తెలుసా?

Om Shanti Shanti Shanti – means?: ఓం శాంతి శాంతి శాంతి..అంటే ఏంటో తెలుసా?

మన హిందూ ధర్మంలో ఆచరించే ప్రతి విధానానికి, పూజలకు, మంత్రాలకు ఓ అర్థం, పరమార్థం దాగి ఉంది. హిందూసంప్రదాయాల ప్రకారం పూజకు ప్రాధాన్యత చాలా ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే..

పూజలో వివిధ రకాల మంత్రాలను చదివినప్పటికీ చివరలో మాత్రం ఓం శాంతి శాంతి శాంతి: అంటూ శాంతి మంత్రాన్ని తప్పనిసరిగా చదువుతాం.

కేవలం ప్రాణులు మాత్రమేకాదు, అంతరిక్షం శాంతి పొందాలి, భూమి శాంతి పొందాలి, వాయువు శాంతి పొందాలి, జలం శాంతిపొందాలి ఇలా అన్నీ శాంతిపొందాలి అని ప్రార్థించడమే హిందూధర్మంలో ఉన్న గొప్పదనం,

అయితే ఈ ఓం శాంతి శాంతి శాంతి: అనగానే పూజ ముగించినట్లు అనే అర్థం కాకుండా దీని వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉంది. మూడుసార్లు మనం చదివే శాంతి మంత్రం వెనుక మూడురకాల భావనలు దాగి ఉన్నాయి.

మూడుసార్లు మూడు అర్థాలు:

ఓం శాంతి శాంతి శాంతి: అనే శాంతి మంత్రంలో మొదటి శాంతి ఆధ్యాత్మిక తాపం చల్లారుగాక అని అర్థం, రెండవ సారి వచ్చే శాంతి అనే పదే ఆదిభౌతిక తాపం చల్లారుగాక అనే భావంతో,

మూడవసారి మనం ఉచ్చరించే శాంతి అనే పదం వెనుక ఆది దైవిక తాపం చల్లారుగాక అనే అర్థం వస్తుంది. ఇంతకీ ఈ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అంటే అర్థాలేంటో తెలసుకుందాం.

ఆధ్యాత్మిక తాపం చల్లారుగాక (మొదటి శాంతి):

Add a heading 2023 12 08T144154.520 Om Shanti Shanti Shanti - means?: ఓం శాంతి శాంతి శాంతి..అంటే ఏంటో తెలుసా?

ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి సంబంధించిన వివిధరకాలైన రుగ్మతలు, రోగాలు మొదలైనవి తొలిగిపోవాలని ప్రార్థించడం.

అంతేకాకుండా ప్రకృతి పరంగా సంభవించే అనేకరకాలైన ఉపద్రవాలు వలన ఏవిధమైన మనకి ఎలాంటి ఆపదలు కలగకుండా సమస్త మానవాళిని రక్షించమని అర్థం. మనస్సును దైవానుగ్రహానికి లోనయ్యేలా చేస్తూ, మానసిక ప్రశాంతత కలిగించమని కూడా అర్థం. దీన్నే ఆధ్యాత్మిక శాంతి అంటారు.

ఆది భౌతిక తాపం చల్లారుగాక (రెండవ శాంతి):


ఆది భౌతిక తాపం అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బాగుండాలని కోరకోవడం. అంటే దొంగలు, వేరే ఎవరైనా శత్రువుల బారినుంచి కలిగే ప్రమాదాలు, బాధలు అందిరికీ తొలగించాలని ప్రార్థించడం.

మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్ని బాగుండాలని, వాటి నుంచి వచ్చే మానసిక, శారీరక ఉపద్రవాలనుంచి ఉపశమనం పొందాలని, దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించడమే రెండవ సారి శాంతి అనడంలో అర్థం.

ఆది దైవిక తాపం చల్లారుగాక ( మూడవ శాంతి):

ఆది దైవికం అంటే యక్షులు, రాక్షసులు మొదలైన ఇతర నకారాత్మక శక్తుల నుంచి, ఇతర జీవరాశుల నుంచి , మనుషుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా సమస్త మానవాళి జీవించాలనేది మూడో శాంతి పదానికి అర్థం.

అలా ఈ మూడు ఉపద్రవాల నుంచీ సమస్త మానవాళిని రక్షించమని వేడుకుంటూ ప్రతీ వేదమంత్రం అయిపోతుంది అనగా చివర్లో ” శాంతి ” పదాన్ని మూడు సార్లు పలుకుతారు.

Leave a Comment