Rama Mandir Inauguration Invitation: జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట అతిధిగా మోదీ..సోనియా గాంధీకి మన్మోహన్ కి ఆహ్వానం.

Add a heading 2023 12 21T165027.038 Rama Mandir Inauguration Invitation: జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట అతిధిగా మోదీ..సోనియా గాంధీకి మన్మోహన్ కి ఆహ్వానం.

Rama Mandir Inauguration Invitation: జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట అతిధిగా మోదీ..సోనియా గాంధీకి మన్మోహన్ కి ఆహ్వానం.

రానున్న కొత్త సంవత్సరం జనవరి నెల 22వ తేదీన ఒక మహోత్తరమైన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు ఏనాడో బీజం పడింది.

అదే రామ జన్మభూమి అయోధ్య Ayodhya లో రామ మందిర ప్రారంభోత్సవం, అలాగే రాముల వారికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ట జరగనున్నాయి.

ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రామాలయం ఉన్న ఊరిని ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ Pm Narendra Modi ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

ఇక ఈ చారిత్రాత్మక ఘట్టానికి హమమహులు, వేద పండితులు, ఘనా పాఠీలు, విచ్చేయనున్నారు. అంతేకాదు, వివిధ రాష్టాల ముఖ్య మంత్రులు, మాజి ప్రధానులు, వివిధ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలోనే రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ Rama Teerdha Kshetra Trust వారికి ఆహ్వాన పత్రికలూ కూడా అందజేస్తోంది.

ఈ ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ Sonia Gandhi , మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ Manmohan Sing ,

Add a heading 2023 12 21T165555.117 Rama Mandir Inauguration Invitation: జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట అతిధిగా మోదీ..సోనియా గాంధీకి మన్మోహన్ కి ఆహ్వానం.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే Mallikharjun Kharge , లోక్ సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న అధిర్ రంజన్ చౌధురి Adhir Ranjan Chowdhuri ఉన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ Congress Party నేతలు ఆ పార్టీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ప్రధాని, జేడీఎస్ JDS అధినేత దేవ గౌడ Deva Gowda కూడా ఆహ్వాన పత్రిక పంపించామని అన్నారు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

కేవలం దేవె గౌడకు మాత్రమే కాక మిగిలిన విపక్షనేతలందరికి కూడా ఆహ్వాన పత్రికలూ పంపించినట్టు పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటె రామజన్మ భూమిని Rama janma bhumi అత్యంత తారాస్థాయిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీరాముని కథ లోని విశేషాలను అంటే రామాయణం లోని విశేషాలను తెలియపెరిచేలా వంద విగ్రహాలను ఈ రామజన్మభూమిలో ప్రతిష్టించనున్నారు.

అంతే కాదు జనవరి 16 వ తేదీ నుండి 22వ తేదీ వరకు కూడా ఇక్కడ అనేక రకాల పూజా కార్యక్రమాలు జారుతూనే ఉంటాయి. రామాలయ నిర్మాణ సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి.

పైగా నూతనంగా నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణం ఆలయం అంత కూడా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోనుంది. అయోధ్య మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.

Leave a Comment