JEE అడ్వాన్స్ దరఖాస్తు పై..మరోసారి ఫీజు పెరుగుదల.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు..అయితే, జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్ రాయడానిక
అర్హులు.జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజును పెంచారు. ఇలా ఫీజులు పెంచడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది దరఖాస్తు ఫీజును
బాలికలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1450 ఉండేది. అయితే, దాన్ని ప్రస్తుతం రూ.1600లకు, ఇతరులకు రూ.2,900 నుంచి రూ.3,200కి పెంచినట్లు ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్ న్యూ మరరీ కోటా కింద కేటాయిస్తారు. ఇక ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్ 2024 పరీక్ష తేదీ కూడా వెలువడింది.
జేఈఈ అడ్వాన్స్ 2024 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 21, 2024 నుంచి ప్రారంభంకానుంది. అయితే, ఈ జేఈఈ అడ్వాన్స్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా అక్టోబర్ 1, 1999 తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
అంటే, వారు అక్టోబర్ 1, 1994 తర్వాత జన్మించి ఉండకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యేటా సుమారు 40 వేల మంది ఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తున్నారు.
ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్టంగా రెండు సార్లు JEE అడ్వాన్స్ పరిక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్ బ్జెక్టులను
తప్పనిసరిగా 2023 లేదా 2024లో చదివి ఉండాలి. మొదటిసారిగా 12వ తరగతి పరీక్షకు హాజరై ఉండాలి. 2022లో లేదా అంతకు ముందు పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈసారి పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కాదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే వచ్చే యేడాది మే 26న పరీక్ష నిర్వహించనున్నారు.