మాఘ పౌర్ణమి రోజున హాంగ్ కాంగ్ మొత్తం అన్నవరం గా మారిపోయింది

WhatsApp Image 2024 03 05 at 11.05.55 AM 1 మాఘ పౌర్ణమి రోజున హాంగ్ కాంగ్ మొత్తం అన్నవరం గా మారిపోయింది

ప్రంపంచం లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న మన సాంప్రదాయాలు మర్చిపోరు అని ఇంకో సారి రుజువు అయ్యింది. అందుకు కారణం ఇటీవల మాఘ పౌర్ణమి రోజున హాంగ్ కాంగ్ లోని హ్యాపి వ్యాలి హిందూ ఆలయం లో భారీ ఎత్తున సత్యనారాయణ వ్రతాలు జరిగాయని తెలుగు అసోసియేషన్ సబ్యులు తెలియచేసారు. హాంగ్ కాంగ్ లో ఒక్క హ్యపి వ్యాలి ఆలయం ఒక్కటే కాదని హాంగ్ కాంగ్ మొత్తం లో ఎన్ని ఆలయాలు ఉన్నాయో అన్ని ఆలయాలలో ఈ సత్యనారాయణ వ్రతాలు జరిగాయని ” ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ” వారు చెప్పారు.


దేశం మొత్తం మీద అన్ని ఆలయాలలో మాఘ పౌర్ణమి రోజున ఈ సత్యనారాయణ వ్రతాలు జరగాలని నిర్ణయించామని అన్ని అనుకున్నట్లు గాని ఎంతో ఘనం గా జరిగాయని సమాఖ్య సబ్యులు చెప్పారు. హాంగ్ కాంగ్ దేశం లో ఉన్న తెలుగు వాళ్ళు వారి కుటుంబ సబ్యులు మొత్తంగా ఈ వ్రతాలలో పాల్గొన్నారు అని చెప్పారు. ఆరోజు దేశం అంతటా ర్యాలీలు చేపట్టామని చెప్పారు. ఇక్కడ తమలపాకులు వక్కలు లాంటివి దొరకవని ఒకవేళ దొరికిన చాలా ఖరీదు ఉంటాయని చెప్పారు. కాని ఈ సారి ఇండియా నుండి తమ సమాఖ్య కు సంబందించిన వ్యక్తులు ఒకరు పంపారని దానితో చాలా ఘనం గా నిర్వహించామని వారు 6టీవీ తెలిపారు.

WhatsApp Image 2024 03 05 at 11.06.06 AM 1 మాఘ పౌర్ణమి రోజున హాంగ్ కాంగ్ మొత్తం అన్నవరం గా మారిపోయింది


అలాగే ఇక్కడ పురోహితులు కుడా దొరకరని కాని ఆరోజు ఇక్కడ మెరైన్ ఇంజినీర్ గా చేస్తున్న శివరాం రాంభట్ల గారు దగ్గర ఉండి పూజ కార్యక్రమాలు జరిగేలా చూసారని సమాఖ్య సబ్యులు చెప్పారు. హాంగ్ కాంగ్ దేశం లో ఉన్న తెలుగువారు మనం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అన్నవరం లో ఉన్నామా అనిపించింది అని అక్కడ తీర్ధ ప్రసాదాలు అలాగే పూజ అనంతరం కమ్మని భోజనాలు ఇవన్ని మాకు ఎంతో సంతోషం గా ఉందని మాటల్లో వర్ణించలేమని అంత ఆనందం గా ఉందని అక్కడ ఉన్న తెలుగువారు చెప్పారు.

Leave a Comment