ఒకప్పుడు సైకిల్ మీద తిరుగు ఇడ్లీ అమ్మే వ్యక్తి – నేడు CEO 8 కోట్లు ఆదాయం

WhatsApp Image 2024 03 15 at 5.07.20 PM ఒకప్పుడు సైకిల్ మీద తిరుగు ఇడ్లీ అమ్మే వ్యక్తి - నేడు CEO 8 కోట్లు ఆదాయం

చెన్నై నగరానికి చెంది శరత్ బాబు నలుగురు అక్క చెల్లెలతో మురికివాడ లో ఉండేవాడు. తన చిన్న తనం లోనే తండ్రి చనిపోవడం తో పిల్లల పెంపకం ఆ తల్లి మీద పడింది.దాంతో రోజుకు 3 ఉద్యోగాలు చేస్తేనే కాని ఇల్లు గగవక పోయేది. ఆదాయం సరిపోక ఒక ఇడ్లీ కొట్టు పెట్టి ఇడ్లీ లు అమ్మేది. తన వంతు గా ఎదో ఒక సహాయం చేస్తూ ఉండేవాడు శరత్ బాబు. అయితే తన తల్లి పడుతున్న కష్టాన్ని దగ్గర గా చుసిన శరత్ బాగా చదువుకుని మంచిగా సెటిల్ అవ్వాలని అనుకున్నాడు, అనుకోగానే చదువును నిర్లక్ష్యం చెయ్యకుండా తన పని మొదలు పెట్టాడు.

తన కుటుంబం లో ఎవ్వరు చదువుకోకపోవడం వల్ల అన్ని కష్టాలు పడేది అనుకునేవాడు. సరిగ్గా తిండి లేకపోయినా చదువును మాత్రం మానలేదు. అలా చదువుకునే 10 లో క్లాస్ టాపర్ వచ్చాడు. ఆ తర్వాత ఇంటర్ కుడా పూర్తి చేసి ఏంతో ప్రతిష్టాత్మికత కల్గిన బిట్స్ పిలాని ఇన్స్టిట్యూట్ లో సీటు సంపాదించాడు. అయితే తనకి ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడం తో ఫ్రెండ్స్ తో కలిసే వాడు కాదు అలాగే తన చదువుని పూర్తి చేసాడు.

అతడు చదివిన కెమికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ అందుకున్నాడు.

తన డిగ్రీ పూర్తి చెయ్యగానే క్యాంపస్ ఇంటర్వ్యూ లో పోలారీస్ అనే మల్టినేషనల్ కంపెనీ లో జాబ్ కొట్టాడు. 30 నెలలు లో తనకి ఉన్న అప్పులు అన్నింటిని తీర్చివేయగాలిగాడు. తర్వాత MBA చెయ్యాలి అనే కోరిక పుట్టింది. జాబ్ చేస్తూనే క్యాట్ కి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ టైం లో సక్సెస్ కాకపోయినా రెండవ ప్రయత్నం లో సేక్సేస్ అయ్యాడు. అహ్మదాబాద్ లో MBA లో చేరి పూర్తి చేసి మంచి మంచి జాబ్ లు లక్షల జీతం అని చెప్పిన జాబ్ వైపుకి పోలేదు, తను పడిన కష్టాలు ఎవ్వరు పడకూడదు అని ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలు పెట్టి కొంతమంది తీసుకుని అలా ఒక హోటల్ పెట్టి ఆ హోటల్ ద్వార కార్పోరేట్ సంస్దలు ,బ్యాంకు లకు ఫుడ్ డోర్ దేలేవేరి చేసేవాడు. అలా మొదలు పెట్టిన ఫుడ్ కింగ్ ప్రయాణం ఈరోజు 200 మంది తో 8 కోట్ల టర్నోవర్ తో ఎవరు ఊహించినంత గా ఎదిగాడు.

Leave a Comment