Ooru Peru Bhairavakona Trailer: ట్రైలర్ తో అద్దరగొట్టిన ఊరు పేరు భైరవకోన

website 6tvnews template 46 Ooru Peru Bhairavakona Trailer: ట్రైలర్ తో అద్దరగొట్టిన ఊరు పేరు భైరవకోన

Ooru Peru Bhairavakona Trailer: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భైరవ కోన. ఈ సినిమా కు ఐవి ఆనంద్(Iv Anand) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో సందీప్ సరసన వర్ష బాలమ్మ(Varsha Bollamma), కావ్య థాపర్(Kavya Thapar) నాయికలుగా నటించారు.

సస్పెన్స్ త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. పైగా ఈ సినిమా నుండి మేకర్స్ ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు, నిజమేనా అంటూ సాగే పాట సెన్సేషన్ గా మారింది.

ఈ సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో అందరి దృష్టి సినిమాపై పడేలా చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను గనుక తమిళంలో(Tamil) కూడా విడుదల చేస్తే నిర్మాతలకు కాసులు దండిగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

ఎందుకంటే సందీప్ కిషన్ కి తమిళ్ కూడా అభిమానులున్నారు. కెరియర్ బిగిం చేసిన నాటి నుండి సందీప్ తెలుగు తో పాటు తమిళ్ పై కూడా ఫోకస్ పెట్టాడు. స్ట్రెయిట్ తమిళ్ సినిమాల్లో కూడా నటించాడు. కొన్ని అతీంద్రియ శక్తులు అడ్డంకులు సృష్టిస్తుండగా హీరో తాను కోరుకున్నదానిని సాధించడం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు.

మరి తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ ఆయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర(Sekhar Chandra) సంగీతాన్ని అందించాడు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి రానుంది.

Leave a Comment