రామ్ చరణ్ తేజ్.. మెగా స్టార్ చిరంజీవి నట వారసుడు, చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమయంలో అతని నటన పై మిశ్రమ స్పందన వచ్చింది.
ఇండస్ట్రీలోని మిగిలిన హీరోలతో పోల్చుతూ అతడిని విమర్శించిన వారు కూడా లేకపోలేదు. అయితే రామ్ చరణ్ తనను తానూ మలుచుకుంటూ వచ్చాడు. ఇండస్ట్రీలో సింగిల్ టెక్ ఆర్టిస్టులు ఉంటారు, కానీ చరణ్ మాత్రం సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ అంటూ గేలి చేసిన వారు కూడా లేకపోలేదు.
అయితే ఏనాడు చరణ్ అలంటి విమర్శలకు స్పందించలేదు. ఆకలితో ఉన్న చిరుత వేటాడే అదును కోసం ఎదురుచూసినట్టు మంచి సినిమా కోసం చరణ్ కూడా ఆతృతగా ఎదురుచూశాడు.
అలంటి సమయంలోనే రంగస్థలం చరణ్ కు తగిలింది. దీంతో తనలోని నటనను బయటపెట్టే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు చెర్రీ.
రంగస్థలం తరువాత అతనికి ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన సినిమా అంటే ట్రిపుల్ ఆర్ అని చెప్పాలి. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తారక్ తో పోటీ పది నటించాడు. అందుకు ఫలితం నేడు దక్కిందని చెప్పాలి. రామ్ చరణ్ ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన నటుల జాబితాలో చెర్రీకి చోటు దక్కింది.
నటనలో అంకితభావం, ప్రామాణికతతో సదరు నటులు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారని ఆస్కార్ అకాడమీ తెలిపింది.
ఇక అకాడమీ విడుదల చేసిన జాబితాను ఒక్కసారి చూద్దాం లషన లించ్, రామ్ చరణ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కో టిన్ లోక్, కేకే పామెర్, చాంగ్ చెన్, సకురా అండో, రాబర్ట్ డావి ఉన్నారు.
ఇక ఇంతకూ ముందే ఆస్కార్ మెంబర్స్ ఆఫ్ క్లాస్ జాబితాను ప్రకటించగా అందులో తారక్ కు చోటుకి కల్పించారు.