Congress MP Dheeraj Sahu: కాంగ్రేస్ MP ధీరజ్ సాహు ఇంట్లో 200 కోట్లకు పైగా నగదు స్వాధీనం.
జార్ఖండ్ లోని కాంగ్రేస్ రాజ్యసభ ఎంపీ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులకు దాదాపు రెండు రోజుల ఆకస్మిక దాడుల అనంతరం 150 నుండి 300 కోట్ల మధ్యలో ఒక కచ్చితమైన అంచనా లేని డబ్బు లభ్యమైంది.
ఐటీ అధికారులు ఆ డబ్బు మొత్తాన్ని లెక్కించే ప్రక్రియలో, 50 కోట్ల లెక్కింపు అనంతరం లెక్కించడానికి ఉపయోగిస్తున్న యంత్రం కాస్త పాడైపోవడంతో ఆ పరిసర ప్రాంతాలైన ఓడిశాలోని బోలంగీర్, సంబల్ పుర్, జార్ఖండ్ లోని రాంచి, లోహర్దా జిల్లాలలో సోదా జరుపుతున్నట్టుగా అధికారులు తెలిపారు.
ఒడిశాలో మరియు జార్ఖండ్ లోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆదాయపు పన్ను శాఖా అధికారులు దాడి చేసారు.ఇపుడు 200 కి పైగా కోట్లతో పట్టుబడిన ధీరజ్ సాహు, లోహర్ దాగాలో నివాసం ఉంటున్నాడు.
ఇతను 1977లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కాంగ్రేస్ నాయకుడు.
బీజేపీ నాయకుడు గౌరవ్ భాటియా శుక్రవారం రోజున మాట్లాడుతూ, ” జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో దాదాపు 10 ప్రదేశాల్లో మూడు రోజులపాటు ఆదాయపు పన్ను శాఖ వారి దాడులు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అందరికి నమ్మశక్యం కానీ వాస్తవాలు బయటపడ్డాయి.
ధీరజ్ సాహు ఇంట్లో ఇప్పటికే 200 కోట్లు రికవరీ అయ్యాయి, ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది దొరికిన డబ్బుకి లింకులని గురించి ఆరా తీస్తూ ఉన్నారు.
30 మందికి పైగా అధికారులు మరియు బ్యాంకు అధికారులు ఈ డబ్బు పూర్తిగా లెక్కించే ప్రక్రియలోనే ఉన్నారు. ఎనమిది కన్నా ఎక్కువ కౌంటింగ్ మెషిన్ లను వాడారు.అక్కడే ఉన్న బోలంగీర్ లోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా హెడ్ బ్రాంచ్ కు 150 ప్యాకెట్ల డబ్బుని తీసుకువెళ్లారు.