Cows marriage ceremony: రెండు దూడలకు పెళ్లి…కార్డులను సైతం ప్రింట్ చూపించిన యజమానులు.
ఈ ప్రకృతిలో ఏ జీవికి లేని బంధాలు,అనుబంధాలు మనుషులకు ఉన్నాయి. వాటి చుట్టూనే మానవ జీవితాలు తిరుగుతుంటాయి. మనిషి తన ప్రేమని, మనుషులలోకానికే పరిమితం చేయకుండా..
తరతరాలుగా ఈ ప్రకృతిలో జీవించే కొన్ని మూగ జీవుల పైన కూడా చూపించటం మొదలుపెట్టారు. వాటి మీద ఎంతో ఎంతో ప్రేమను పెంచుకుంటూ, వాటికి కూడా మనుషుల బంధాలతో ముడిపెడుతుంటారు.
అలాంటి సంఘటన ఒకటి ఉత్తర్‌ప్రదేశ్ లో జరిగింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావస్తిలోని రాంపుర్ కటేల్ గ్రామానికి చెందిన భభూతి ప్రసాద్ వద్ద నందిని అనే ఓ దూడ ఉంది.
దానిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ దూడకు వివాహం జరిపించాలనుకున్నారు. ఇందుకోసం బహ్రైచ్ జిల్లాకు చెందిన నిహానియ కుట్టి అనే రైతుతో మాట్లాడి దూడల పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
దూడల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రెండు దూడలకు తిలకం దిద్దే కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు పెళ్లి కార్డులను సైతం ప్రింట్ చేయించారు.
తెలిసిన వారందరికీ దూడల పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రాలను పంపించారు. ఈ పెళ్లికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు ఆ ఇద్దరు రైతులు.
దూడల వివాహ కార్యక్రమాన్ని డ ఇద్దరి రైతులు ఘనంగా జరిపించారు. ఈ వేడుకకు రాంపుర్ కటేల్ గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.
వేద మంత్రోచ్ఛరణల మధ్య దూడల కళ్యాణం అత్యంగా వైభవంగా జరిగింది. అనంతరం రెండు దూడలనూ ట్రాక్టర్‌పై కూర్చోపెట్టారు. ఆపై వధువు దూడ ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో గ్రామస్థులు డీజే పాటలకు స్టెప్పులు వేశారు. రెండు దూడల పెళ్లి చేసి గోసంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని రైతు భభూతి ప్రసాద్ తెలిపారు. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేశానని ఆ యజమాని చెప్పాడు.
ఎంతో వినూత్న పద్ధతిలో ఆ దూడపై వినూత్నంగా ప్రేమను చూపారు ఆ ఇద్దరు వ్యక్తులు. వాటి పెళ్లికి అతిథులను కూడా పిలిచి, వాటి పెళ్లి ని ఎంతో ఘనంగా చేశారు.
అంతే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఓ స్టేజీని ఏర్పాటు చేశారు. ఈ పెళ్లిలో ఆ దూడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.