Breaking News

Oyo Room double murders behind Reason: ఆ జంట హత్యల వెనుక కారణం అదే.రూమ్ లో లభించిన సూసైడ్ నోట్ లో ఏముందంటే.

23 1 Oyo Room double murders behind Reason: ఆ జంట హత్యల వెనుక కారణం అదే.రూమ్ లో లభించిన సూసైడ్ నోట్ లో ఏముందంటే.

Oyo Room double murders behind Reason: ఆ జంట హత్యల వెనుక కారణం అదే.రూమ్ లో లభించిన సూసైడ్ నోట్ లో ఏముందంటే..

ఢిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలోగల ఓయో హోటల్‌ గదిలో ఓ జంట, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషయం సంచలనంగా మారింది. ఎట్టకేలకు ఈ డెత్ మిస్టరీపై పోలీసులు అసలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అక్టోబర్ 27వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సోహ్రాబ్, అయేషా అనే జంట ఢిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలోని ఓయో హోటల్‌ గది అద్దెకు తీసుకున్నారు.

మధ్యాహ్నం 1.02 గంటలకు చెక్ ఇన్ అయ్యారు. చెక్ ఇన్ అయ్యాక నాలుగు గంటలపాటు గదిని లాక్ చేసుకున్నారు. వారు ఎంతకీ బయటకు రాకపోవడంతో రాత్రి 7:45 గంటల సమయంలో హోటల్ సిబ్బంది తలుపు తట్టారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బీట్‌ కానిస్టేబుల్‌కు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్, పరిస్థితిని సమీక్షించిన తరువాత, స్టేషన్ కు కబురు చేశాడు. పోలీసు అధికారుల సమక్షంలో గది తలుపులు తేరవగా వారు అవాక్కయ్యారు.

సోహ్రాబ్ హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఇక అయేషా చుస్తే మంచంపై విగత జీవిగా కనిపించింది. కానీ అయేషా మెడమీద మాత్రం కత్తి గాట్లు ఉండటంతో వెంటనే ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇక ఓయో హోటల్ రూమ్ లో పోలీసులు తనిఖీ చేయగా వారికి ఒక సూసైడ్ నోట్ లభించింది. హిందీ లో రాసి ఉన్న ఆ ఆత్మహత్య లేఖ సారాంశం ఏమిటంటే తామిద్దరం ప్రేమలో ఉన్నామని, తమ జీవితాలను కలిసి ముగించాలని నిర్ణయించుకున్నామని వారు పేర్కొన్నారు.

ఇక పోస్ట్ మార్టం ద్వారా తెలిసింది ఏమిటంటే అయేషా మెడను కత్తి తో కోసి హత్య చేసిన తరువాత, సోహ్రాబ్ ఫ్యాను కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *