Breaking News

Paayal ghosh says she will marry shami : పేసర్ షమీ పై పాయల్ కాంట్రవర్సీ ట్వీట్.పెళ్లి చేసుకుంటా అంటున్న పాయల్.

ezgif 3 adf4ae58da Paayal ghosh says she will marry shami : పేసర్ షమీ పై పాయల్ కాంట్రవర్సీ ట్వీట్.పెళ్లి చేసుకుంటా అంటున్న పాయల్.

Paayal ghosh says she will marry shami : పేసర్ షమీ పై పాయల్ కాంట్రవర్సీ ట్వీట్.పెళ్లి చేసుకుంటా అంటున్న పాయల్.

పాయల్ ఘోష్ ఈ అమ్మడు గుర్తుందా.. అలా సడన్ గా ఎలాగండి బాబు కొంచం టైం ఇవ్వండి అంటారేమో.. ఎందుకంటే ఆ అమ్మడుకి నిమాల్లో గ్యాప్ కూడా అలానే వచ్చింది.

అప్పుడెప్పుడో మంచు మనోజ్ తో ప్రయాణం అనే సినిమాలో నటించింది, ఆతరువాత jr ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేసింది ఈ చిన్నది. అయితే ఆ రెండు సినిమాల్లోనూ ఈమె హీరోయిన్ కాదు.

హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ అంతే. ఇక ఊసరవెల్లి తరవాత పాయల్ పూర్తిగా కనుమరుగైపోయింది అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కత్తాకు చెందిన ఈ బ్యూటీ కెరియర్ ను మోడలింగ్ తో బిగిన్ చేసింది.

సరైన హిట్టు పడకపోవడంతో పాపం లైమ్ లైట్ లో ఎక్కువకాలంపాటు నిలవలేకపోయింది. తెలుగు హిందీ కన్నడ మూడు భాషల్లో కలిపి పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేకపోయింది.

అయినా ఉన్నట్టుండి ఈ బ్యూటీ గురించి ఎందుకు డీటైల్స్ చెబుతున్నారా అని మీకు డౌట్ రావచ్చు. ఇలాంటి అవుట్ ఫోకస్ బ్యూటీలు ఉన్న చోట ఉండకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు.

మొన్నా మధ్యలో బాలీవుడ్‌లో చెలరేగిన మీటూలో తన గొంతు గట్టిగానే వినపడేలా చేసింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్‌ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అనురాగ్ తనను లైంగికంగా వేధించాడని తెలిపింది.

ఆతరువాత కొన్నాళ్ళకు, ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల సమయంలో jr ఎన్టీఆర్ మీద మాత్రం ప్రశంశల జల్లు కురిపించింది.

ఆలా చేస్తే ఏదైనా సినిమా అవకాశాలు ఇస్తారనుకుందో, లేక అవి నిజంగా తన మనుసులోతుల్లో నుండి వచ్చిన మాటలో ఏమో కానీ పాజిటివ్ గానే మాట్లాడింది తారక్ గురించి.

ఇప్పుడు తాజాగా చుస్తే ఇండియన్ క్రికెటర్ మహ్మమద్‌ షమీ గురించి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్లేయర్ గా వికెట్లను చాలా సునాయాసంగా పడగొట్టే షమీ ఇంగ్లిష్ లో మాట్లాడడానికి కొంత ఇబ్బంది

పడుతున్నాడని, ఒక వేళా తను ఇంగ్లిష్ బాగా మాట్లాడటం నేర్చుకుంటే పెళ్లి చేసుకోవడానికి అభ్యతరం లేదని ట్వీట్ చేసింది.

ఈ అమ్మడు చేసిన ట్వీట్ షమీ ఫాన్స్ కి కోపం తెప్పిస్తోంది. షమీ కి ఇంగ్లీష్ మాట్లాడటం రాదనీ ఎగతాళి చేసినట్టుగా మాట్లాడటం సమంజసం కాదని అంటున్నారు.

అయినా కెరియర్ లో వెనకబడ్డ ఇలాంటి బ్యూటీస్ ఎదో విధంగా నలుగురి దృష్టిలో పడేందుకు ఇలాంటి మాటలే మాట్లాడతారని ఎదురు దాడి చేస్తున్నారు.

ఎదో ఒక రకంగా వార్తల్లో నిలబడితే దర్శక నిర్మాతలు వారిని పూర్తిగా మర్చిపోకుండా ఉంటారని, ఎదో ఒక సినిమాలో చిన్న అవకాశం ఇస్తారనే ఆశ వీరికి ఉంటుందని దుయ్యబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *