Padmavibhushan Chiranjeevi : మెగాస్టార్ మంచి మనసు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సత్కారం

website 6tvnews template 2024 01 31T143306.709 Padmavibhushan Chiranjeevi : మెగాస్టార్ మంచి మనసు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 'చిరు' సత్కారం

ఎలాంటి బ్యాక్‎గ్రౌండ్ లేకుండా తన నటనతో, డ్యాన్సింగ్ టాలెంట్‎తో, తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా చిరంజీవి Chiranjeevi ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మెగాస్టార్ ఇన్‎స్పిరేషన్‎తో ఎంతో మంది యువ తారలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

తెలుగు సినిమాకు చిరంజీవి అందించిన సేవలకు గాను ఆయనకు దేశంలో రెండవ అత్యున్నతమైన పద్మవిభూషన్ పురస్కారాన్ని (Padmavibhushan Award) కేంద్ర సర్కార్ (Central Government)ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య (Gaddam Sammayya)కు, డాక్టర్‌ ఆనందచారి వేలు( DR.Anandachari Velu)కు కేంద్రం పద్మశ్రీ పురస్కారాలను అందించింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గడ్డం సమ్మయ్య, ఆనందచారిలను గౌరవప్రదంగా తన ఇంటికి ఆహ్వానించారు. వారికి శాలువా కప్పి, పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు. అంతే కాదు వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు.

Protect artists along with arts : కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలి

270510 ch2 1 Padmavibhushan Chiranjeevi : మెగాస్టార్ మంచి మనసు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 'చిరు' సత్కారం

అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపాన్ని పరిరక్షిస్తున్న గడ్డం సమ్మయ్య (Gaddam Sammayya)కు పద్మశ్రీ (Padmasri) లభించడం పట్ల చిరంజీవి (Chiranjeevi)హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా శిల్పకళలో వినూత్న సేవలు అందిస్తున్న ఆనందచారి వేలు (DR.Anandachari Velu)కు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

యాదాద్రి (Yadadri) పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో ఆనందచారి పాత్ర వెలకట్టలేనిదని చిరు కొనియాడారు. కృష్ణశిల (Krishna stone)తో ఆయన తీర్చిదిద్దిన ప్రతి కళ ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి ఆర్ట్స్, ఆర్టిస్టులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తున్న కుటుంబాలను ఆదుకోవాలని , కళాకారులను కాపాడుకోవాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి లాంటివారు తమను ఇంటికి పిలిచి సన్మానించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఈ అనుభూతిని జన్మలో మరిచిపోలేమని సమ్మయ్య, వేలు ఆనందం వ్యక్తం చేశారు.

Gaddam Sammaiah as Yakshagana artist for 50 years :

padma vibhushan chiranjeevi hosts padma awardees b 3101241212 1 Padmavibhushan Chiranjeevi : మెగాస్టార్ మంచి మనసు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 'చిరు' సత్కారం

50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా గడ్డం సమ్మయ్య
చిందు యక్షగాన కళాకారుడు(Chindu Yakshagana artist) గడ్డం సమ్మయ్య (Gaddam Sammayya) స్వస్థలం జనగాం జిల్లా (Janagam District)దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం . యక్షగాన కళాకారుడిగా ఈయన గత 50 సంవత్సరాలుగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

1985లో ‘కీచకవధ’లో కీచక అనే క్యారెక్టర్ పోషించి గుర్తింపు సంపాదించారు. 1994లో తెలుగు వర్శిటీ (Telugu University)ఆయన సేవలకు గాను ప్రతిభా అవార్డును ప్రకటించింది. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షిక వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా కళారత్న (Kalaratna) పురస్కారం అందుకున్నారు గడ్డం సమ్మయ్య. ఇక 2017లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురుస్కారంతో ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది.

ఈ మధ్యనే కేంద్ర సర్కార్ గడ్డం సమ్మయ్యను పద్మశ్రీ Padma sri అవార్డుతో సన్మానించింది.

Anandachari was the key to the reconstruction of Yadadri :

యాదాద్రి పునర్నిర్మాణంలో కీలకం ఆనందచారి
కృష్ణ శిల(Krishna stone)ను ఉపయోగించి తెలంగాణలో ఉన్న యాదాద్రి (Yadadri) పుణ్యక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడంలో డా.

ఆనందాచారి వేలు (DR.Anandachari Velu) కీలకపాత్ర పోషించారు. కాకతీయ, ద్రవిడ ,చోళ నిర్మాణ శైలిలో ఆలయాన్ని ప్రధాన స్థపతి హోదాలో అవిశ్రాంతంగా పనిచేసి ఎంతో అద్భుతంగా నిర్మించారు .

తిరుమల తిరుపతి దేవస్థానంలోని (Tirumala Tirupathi Devasthanam) శిల్ప కళాశాలలో శిక్షణ పొందిన ఆనందాచారి మొదటగా ఉమ్మడి ఏపీలోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు.

శిల్ప కళలలో సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ ఈ మధ్యనే ఆనందాచారిని పద్మశ్రీ (Padma Sri)అవార్డుతో సత్కరించింది.

Leave a Comment