అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు పాకిస్తాన్ మమిళ సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది.ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్ తాను కృష్ణ భక్తురాలిని అని చెప్పుకుంటోంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాదాపు 500 ఏళ్ళ తర్వాత భారతీయుల కల సాకారమైన వేళ ప్రపంచం నలుమూలల నుండి ఆ అయోధ్య రాముడుని చూడడానికి పక్కదేశాల వాళ్ళే కాదు ఖండాతరాలు దాటి మరి మన అయోధ్య రామయ్యను దర్శించుకుంటున్నారు.సామాన్య మానవుడు నుండి పెద్ద పెద్ద దేశాది నాయకులు అందరు ఆ రామయ్యను చూసి పులకించి పోతున్నారు.
కుల మత భేదాభిప్రాయలు లేకుండా ఏ ప్రాంతం వారైన దర్శించు కోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ నుండి నేపాల్ మీదు గా భారత్ లో అడుగు పెట్టిన పాకిస్థాన్ మాహిల తాను కాలినడక ణ అయోధ్య రాముడు ని చూడడానికి అనుమతి కోసం యోగి సర్కార్ కు దరఖాస్తు చేసుకుంది.
ఇంతకుముందే ఉత్తర ప్రదేశ్ కి చెందిన సచిన్ అనే యువకుడి మీద ప్రేమ ఉండడం తో తాను పాకిస్డాను నుండి నేపాల్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కు చేరుకున్నానని తెలిపింది. తాను కృష్ణుడి భాక్తురాలిగా చెప్పుకొచ్చింది. తాను హిందూ పండగలను రహస్యం గా పాకిస్దాన్ లో ఉన్నప్పుడు చేసుకునేదానిని అని చెప్పింది. ఇప్పుడు భారత్ లో అడుగు పెట్టాక తాను హిందువు గా మారినట్లు చెప్పింది.
తన తో పాటు తన నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పింది. ఇప్పుడు సచిన్ తో కల్సి నోయిడా లో ఉంటుంనట్లు చెప్పింది. అంతే కాకుండా తనకి భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పింది. దీనికోసం ఒక లాయర్ కూడా ఏర్పారు చేసుకున్నట్లు చెప్పింది.
అయితే ఇప్పుడు తనకి అయోధ్య రామ లల్లా చూడాలని ఉందని తన ఉన్న ప్రాంతం నుండి కాలి నడకన అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నానని అందుకోసం తనకు అనుమతి ఇవ్వమని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కి ఒక దరఖాస్తు చేసుకున్నానని అని చెప్పింది. అయితే సీమ హైదర్ తరపున లాయర్ మాట్లాడుతూ సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన కొన్ని పనులు పూర్తి కావచ్చాయని ఆయన చెప్పారు.