Palamuru Rangareddy project: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు 60 శాతం నిధులు.

60 percent funding for Palamuru Ranga Reddy project.


Palamuru Rangareddy project:
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది మహబూబ్ నగర్, రంగారెడ్డి (Ranga Reddy)

జిల్లాల్లోని వ్యవసాయ భులులకు జీవనాడి వంటిది. ఆయా జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు నీటిని అందించడానికి తలపెట్టిన బృహత్తర నీటి ప్రాజెక్టు ఇది.

అన్నదాతల పాలిట అన్నపూర్ణ గా అవతరించబోయే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2014 ప్రారంభమై 2023 లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు లో 5 రిజర్వాయర్లు(Reservoirs),

145 పంపులు, 260 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించ విషయం తెరపైకి వచ్చింది.

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు(Palamuru Ranga Reddy Lift Irrigation Scheme) కేంద్ర ప్రభుత్వం(Central Government) 60 శాతం నిధులు మంజూరు చేసింది.

ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఎలా స్పందించారంటే : How did the Union Water Resources Minister react to the project?

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)

images 100 Palamuru Rangareddy project: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు 60 శాతం నిధులు.

ఇటీవలికాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతా పార్టీకి(BJP), కేంద్ర ప్రభుత్వానికి(Central Government) లేఖలు వ్రాశారు.

ఆ లేఖల సారాంశం ఏమిటంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు జాతీయ హోదాను(National Status) ప్రకటించాలని వారు కోరారు.

అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలి కాలం లో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర శకవాత్(Gajendra Sakavath) ని కలుసుకున్నారు. ఆ సమయం లో ప్రెజెక్టు విశిష్టతను కేంద్ర మంత్రి దృష్టికి వీరిరువురు తీలుకెళ్ళగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

జాతీయ హోదా దక్కినట్టేనా ? : Does This Project Get national status ?

2014 లో మొదలైన ఈ ప్రాజెక్టు కు ఆనాటి నుండి జాతీయ హోదా లేదు, ఇప్పటికైనా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు

జాతీయ హోదా కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరినట్టు అవుతుందని సీఎం రేవంత్, మినిస్టర్ ఉత్తమ్ కేంద్ర మంత్రికి విన్నవించారు.

ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కింద ఉన్న నాగర్‌కర్నూల్(Nagar karnool), మహబూబ్‌నగర్(Mahaboob Nagar), వికారాబాద్(Vikarabad), నారాయణపేట(Narayanpeta), రంగారెడ్డి(Rangareddy), నల్గొండ(Nalgonda) జిల్లాలలో కరువు ప్రాంతాలకు నీటిని అందించడమే కాకుండా,

ఫ్లోరైడ్ బాధితులకు త్రాగునీరు అందించి ఫ్లోరోసిస్(Florosis) నుండి వారికి విముక్తిని ప్రసాదించడానికి వీలవుతుందని చెప్పుకొచ్చారు. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు కోసం 60 శాతం నిధులను రాష్ట్రానికి అందజేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ ప్రాజెక్టు కు కొన్ని అడ్డంకులు : There are some obstacles to this project

ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాశయం(Srisailam Dam) నుండి నీటిని మోటార్ల సహాయంతో తోడి పోస్తారు. ఈ నీటిలో ఎక్కువశాతం వ్యవసాయానికి(Irrigation) వినియోగిస్తారు.

తద్వారా సుమారు 10 లక్షల పైచిలుకు రైతులకు ఉపాధి అందుతుంది. అలాగే నీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నీరు(Drinking Water) ఎంతగానో ఉపయోగపడుతుంది.

srisailam dam Palamuru Rangareddy project: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు 60 శాతం నిధులు.

ఈ నీటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) సహా చుట్టుప్రక్కల ఉన్న 1226 గ్రామాల దాహార్తిని తీర్చడానికి వాడతారు.

ఈ ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఆమోదాన్ని పొందినప్పటికీ హైడ్రాలజీ(Hydralogy), నీటిపారుదల ప్రణాళిక, వ్యయ అంచనాలకు సంబంధించిన అడ్డంకులు,

అపెక్స్ బాడీ క్లియరెన్స్(Apex Body Clearance) వంటి అంతర్రాష్ట్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలు మొత్తం గట్టెక్కితే ఎటువంటి ఢోకా ఉండదు.

ఈ విషయాలు కూడా కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రి, రాష్ట్ర మంత్రి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. వాటిపై కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. వాటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వినికిడి.

Leave a Comment