Palestine Flag on Cricket bat.. Board imposed heavy fine: క్రికెట్ బ్యాట్‌పై పాలస్తీనా జెండా.. భారీ జరిమానా వేసిన బోర్డు
నేషనల్ T20 మ్యాచ్ లో 25 ఏళ్ల పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ అజం ఖాన్ తన బ్యాట్ పైన పాలస్తీనా జాతీయ జెండా స్టిక్కర్ ని అతికించినదుకు గాను క్రికెట్ బోర్డు అజం ఖాన్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.
ఐసిసి ప్రవర్తనా నిబంధనలను ఉల్లఘించినందుకు ఈ జరిమానా పడింది. పాకిస్థాన్ లోని ఒక జియో టివి, ఆదివారం రోజు లాహోర్ బ్లూస్ తో కరాచీ వైట్స్ తో ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో ఒక వికెట్ కీపర్ అతని బ్యాట్ కి అలా స్టిక్కర్ అతికించాడని ఈ జియో టివి తెలిపింది.
బ్యాటర్ అంగీకరించని లోగోలను బ్యాట్ లపైన ప్రదర్శించవద్దని మ్యాచ్ రిఫరీ అందరికి ముందుగానే చెప్పాడు, అయినప్పటికీ అలా చేసినట్టయితే అది వారి నియమాల ఉల్లంఘనే అవుతుంది.
కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో లాహోర్ బ్లూస్ తో జరిగిన మ్యాచ్ లో అజం ఖాన్ చేసిన ఈ లెవెల్ 1 నేరం ఆర్టికల్ 2.4 ను ఉల్లఘించినట్లుగా పేర్కొన్నారు.
అజం ఖాన్ దగ్గర ఉన్న వీల్లోలన్నింటిలో ఇలాంటి స్టిక్కర్లు ఉన్నాయని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా సమాచారం. అతను ఇలా బ్యాట్ లపైన జండాని ముద్రించి ప్రదర్శించడం ఇదేం మొదటిసారి కాదు.
ఇంతకుముందు టోర్నమెంట్ లో జరిగిన కరాచీ వైట్స్ రెండు ఔటింగ్ లలో ఇలా బ్యాట్ లపై ముద్రించి ఉపయోగించడాని నివేదికలో వెల్లడి అయింది.
జాతీయ, మత, రాజకీయ పరమైనటువంటి ఎలాంటి సందేశాలను ICC ప్రోత్సహించదు.
కానీ తర్వాత PCB ఈ జరిమానని రద్దు చేసింది. ఎందుకు?
నిభందనల ఉల్లంఘనకు వేసిన జరిమానా రద్దు చేసేటట్లైతే అలాంటప్పుడు నిభంధనలు పెట్టడo ఎందుకు?
వివరాల్లోకెళ్తే..
బ్యాట్ పైన జెండాను ప్రదర్శించిన కారణంతో అజం ఖాన్ పైన విధించిన జరిమానా తొలగించాలని పాకిస్థాన్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
జరిమానా విధించిన తర్వాత సామాన్య ప్రజలు, క్రికెట్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర దూమరాన్ని తీసుకువచ్చింది.
పాకిస్థాన్ ఒక్కో ప్లేయర్ ని ఒక్కోలాగా చూస్తొందని, ఇంతకుముందు ఈ నిబందనలను ఉల్లంఘించిన రిజ్వాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకొని అధికారులు అజం ఖాన్ పైన చర్యలు తీస్కోవడం సరైనది కాదని విమర్శించరి క్రికెట్ అభిమానులు.
పాకిస్థాన్ వికెట్ కీపర్ – బ్యాటర్ మూహమూద్ రిజ్వాన్ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ట్విటర్ లో ఒక ట్వీట్ చేశాడు. అయితే ఇది కేవలం తన స్వంత అభిప్రాయమని చెప్పి ICC జరిమానా నుంచి తప్పించుకున్నాడు.
అంపైర్ ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఇలాంటి తప్పు జరిగినది, అలాగే జరిమానా వీధించబడింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమీక్షించి, ఈ జరిమానని పూర్తిగా తొలగించింది.
తొలగించిన మాట వాస్తవమే గాని ఆసలు కారణాలేంటి అనేదే బయటకు వివరణ ఇవ్వలేదు.
ఇప్పటికే రెండు మూడు సార్లు ఇలా పాలస్తీనా జెండా స్టిక్కర్లు ప్రదర్శించిన అజం, ఇక ఫైన్ నుంచి కూడా తప్పించుకోవడంతో తరువాతి మ్యాచ్ లో కూడా ఇలాగే చేస్తాడా అని, అసలు ఏం చేస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
అసలు జరిమానా తొలగించడం వెనకాల వాళ్ళ అభిప్రాయాలు ఎంటో అన్న కొత్త చర్చ ఇపుడు మారుమోగుతోంది.
ఇంతకు ముందు కూడా ఇలాంటి సంగతనలు జరగకపోలేదు, 2019 లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఉన్న ధోనీ ఆర్మీ గుర్తు గల గ్లోవ్స్ వేసుకొని వచ్చాడు, అప్పటికే అతను ఇండియన్ ఆర్మ్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నాడు.
అప్పటి అమరవీరులకు నివాళిగా అలా గ్లౌస్ వేసుకొచ్చాడు, అయితే దీని గురించి నెట్టింట్లో పెద్ద రచ్చే అయ్యింది.
అప్పుడు ICC మద్యలో కలుగజేసుకొని, ధోనీని ఆ గ్లౌస్ తేసేయమని సూచించింది, ఇది ఐసిసి నియమాలకు వ్యతిరేఖమని సూచించింది.
దాంతో ధోనీ ఆ గ్లౌస్ లు పక్కన పెట్టి, సాధారణ గ్లౌస్ తో వచ్చాడు. అప్పుడు కూడా నియమాల ఉల్లంఘన జరిగినది.
కానీ ఎలాంటి జరిమానా విదించని ఐసిసి ఇపుడు ఆజం ఖాన్ పైన జరిమానా ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అప్పటికి 2 మ్యాచ్ లలో ఉన్న స్టిక్కర్ గురించి ఎలాంటి హెచ్చరిక ఇవ్వకుండా మూడవసారి నేరుగా జరిమానా విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఆజం ఖాన్ ఇస్లామాబాద్ యునైటెడ్, సింధ్ తరపున ఆడుతున్న పాకిస్థాన్ క్రికెటర్. అతను పాకిస్థాన్ లోని కరాచీలో ఆగస్టు 10 1998 లో పుట్టాడు.
జులై 2021 లో పాకిస్థాన్ టీం కోసం స్టేడియంలోకి అడుగు పెట్టాడు. వెస్టిండీస్ తరపున ఆడే క్రిస్ గ్రేల్ ను తన రోల్ మోడల్ గా భావిస్తాడు.
వికెట్ కీపర్ గా క్రికెట్ అభిమానులకు సుపరిచితం. పాకిస్థాన్ మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్ అయిన మోయిన్ ఖాన్ కొడుకు.
ఒక క్రికెటర్ గా ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు విమర్శకుల్ని ఎదుర్కుంటూ ఉంటాడు. అయితే ఈ మద్యనే 14 కిలోల బరువు తగ్గాడు.