Bigg Boss Pallavi Prashanth: చంచల్‌గూడ జైలులో పల్లవి ప్రశాంత్..14 రోజుల రిమాండ్.
బుల్లితెరలో అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమం బిగ్ బాస్ (Bigg Boss). ప్రతి సీజన్ కొత్త కాన్సెప్ట్‌తో ఈ షోను నడిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నిర్వాహకులు.
ఈ ఏడు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss season 7)ను ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తో నిర్వహించారు. ఈ సీజన్ విజేతగా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth). షో కాన్సెప్ట్ లాగే పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) పరిస్థితి కూడా అంతా ఉల్టా పల్టా అయిపోయింది.
టైటిల్ గెలిచాక తన క్రేజ్ పెరుగుతుందని భావించిన ప్రశాంత్ ప్రస్తుతం జైలులోఊచలులెక్కబెడుతున్నాడు. టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే అన్నపూర్ణ స్టూడియోస్ (annapoorna studios) దగ్గర రైతు బిడ్డ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.
దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టారు. ఈ క్రమంలో ప్రశాంత్ పరారీ కావడంతో విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. ఇక తాజాగా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పల్లవి ప్రశాంత సొంతూరైన సిద్దిపేట జిల్లా (siddipet) గజ్వేల్ (gajwel) మండలం కొల్లూరు (kollur)లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Judicial remand for 14 days:
ఈనెల 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ (annapoorna studios) దగ్గర పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రభుత్వ ఆస్తులపై దాడి చేశారు.
ఈ ఘటనలో పల్లవి ప్రశాంత్ ను ఏ–1 నిందితుడిగా ,అతని తమ్ముడుని ఏ–2 నిందితుడుగా చేర్చారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)లో పల్లవి ప్రశాంత్ ను కాసేపు విచారించిన తర్వాత…పోలీసులు అర్ధరాత్రి వేళ న్యాయమూర్తి ఎదుటు హాజరుపరిచారు.
ఈ కేసులో జడ్జీ 14 రోజుల రిమాండ్ (14 days Judicial remand)విధించారు. దీంతో ప్రశాంత్‌ను, అతడి తమ్ముడిని చంచల్ గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు.
అయితే వీరిద్దరిని త్వరలోనే కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth)పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Cases against Pallavi Prashanth at Jubilee Hills Police Station:
బిగ్ బాస్ (Bigg Boss)షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దిగ్విజయంగా ఈ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. లేటెస్ట్‌గా ఏడో సీజన్ కూడా కంప్లీట్ అయ్యింది.
ఈ సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విజేతగా (title winner)నిలిచాడు. అయితే షో పూర్తిగానే బయటికి వచ్చిన ప్రశాంత్.. ఆ రోజు రాత్రి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.
విజేతగా పల్లవి ప్రశాంత్ ను అనౌన్స్ చేయగానే అమర్ దీప్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth) అభిమానులు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో కొందరి సెలెబ్రిటీల కార్లను,
ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు 6 బస్సుల వరకు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. దీంతో జూబ్లిహిల్స్ పోలీసులు (Jubilee Hills Police) ప్రశాంత్ పై సుమోటోగా పలు కేసులు నమోదు చేశారు.
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పైన కేసులు పెట్టారు. 147, 148,290,253,427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద పలు కేసులు పెట్టారు.
పోలీసులు కేసులు పెట్టడంతో ప్రశాంత్ ( Pallavi Prashanth)అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు టాక్ నడిచింది. రైతు బిడ్డ ఫోన్ కూడా స్విచాఫ్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
3 బృందాలతో పల్లవి ప్రశాంత్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రశాంత్ కొమరవెల్లి (komuravelli) సమీపంలోని ఓ విలేజ్ లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. సర్కార్ ఆస్తులకు, ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ కు నష్టం కలిగించినందుకు పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్ పేరు ఉండటంతో నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేసులో దర్యాప్తును కూడా పోలీసులు ముమ్మరం చేశారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిర్వహించిన ర్యాలీ వల్లే గొడవలు జరిగాయని పోలీసులు గుర్తించారు.