PARLE -G Girl Changed: బేబీ కి బదులు ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్.
PARLE – G గురించి అసలు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
దశాబ్ధాలుగా PARLE – G మార్కెట్ లో అమ్ముడవుతుంది.
ఇక PARLE – G అనగానే దానిపై ఉన్న చిన్న పాప ముఖం గుర్తొస్తుంది. కానీ ఇప్పడు ఆ పాప ముఖానికి బదులు PARLE – గ్ పాకెట్ పైన ఒక ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ ముఖం కనపడుతుంది. అదేంటి, అలా ఎలా మార్చారు అంటే,
PARLE – G పైన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ :
ఇంస్టాగ్రాంలో BUNSHAH అనే ఒక కంటెంట్ క్రియేటర్ ఒక ఫన్నీ వీడియొ చేశాడు.
PARLE – G యాజమానిని కలిస్తే మిస్టర్. పార్లె అనాలా?లేదంటే పార్లె జీ అనాలా..?
అంటూ రీల్ పోస్ట్ చేశాడు. ఈ రీల్ వైరల్ అవడం తో అది పార్లె జి యాజమాన్యం వరకు వెళ్ళింది.
దానితో వారు ఈ రీల్ కి స్పందనగా BUNSHAH ముఖాన్ని PARLE – G పైన ఎడిట్ చేసి పోస్ట్ పెట్టారు.
ఇకపై PARLE – G పైన BUNSHAHనే ఉంటాడా :
లేదు. ఇది కేవలం హాస్యాస్పదంగా పెట్టిన పోస్ట్ మాత్రమే, PARLE – G పైన ఎప్పటిలాగే ఆ అమ్మాయి ముఖం మాత్రమే ఉంటుంది.