Parliamentary party meetings presided by KCR : సిద్ధిపేట(Siddipeta) జిల్లా ఎర్రవెల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జనవరి 26వ తేదీన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Ex CM K. Chandrasekhar Rao) అధ్యక్షత వహింహచారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగి చికిత్స తీసుకున్న తరువాత నుండి అయన ఎటువంటి సభలలో సమావేశాల్లో పాల్గొనలేదు.
ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకున్న తరువాత కేసీఆర్ పాల్గొన్న తోలి సమావేశం ఇదే కావడం విశేషం.
నేతలకు దిశానిర్దేశం : Guidance for leaders
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(K Tarakarama Rao), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పాల్గొన్నారు.
వీరితో పాటు సీనియర్ పొలిటిషియన్లైన కేశవరావు(K Kesava Rao), నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) కూడా పాల్గొన్నారు.
ఇక వీరిద్దరిలో ఒకరు రాజ్య సభకు మరొకరు లోక్ సభ కు ఫ్లోర్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. జనవరి 31వ తేదీ నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) జరగనున్న నేపథ్యంలో లోక్ సభ సభ్యులకు అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వివరించారు.
అలాగే బడ్జెట్ సమావేశాల సమయం కావడం తో నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు.