Payal shared exciting things about the movie : మంగళవారం సినిమా పై ఆశక్తికర విషయాలు పంచుకున్న పాయల్..హీరో కార్తికేయతో మళ్లీ చేయాలనుందంటున్న బోల్డ్ బ్యూటీ..
ఆర్.ఎక్స్ 100 సినిమాలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి పాయల్ రాజ్ పుత్. యదార్ధ సంఘటనల ఆధారంగా అజయ్ భూపతి ఆర్.
ఎక్స్ 100 సినిమాను తెరకెక్కించారని అప్పట్లో టాక్ వినిపించింది, కానీ తెరమీద పాయల్ రాజ్ పుత్ నటన చుస్తే మాత్రం యదార్ధాన్ని కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. అయితే ఈ భామ మరో సారి అజయ్ దర్శకత్వంలో నటిస్తోంది. ఆ సినిమానే మంగళవారం.
ఈ సినిమా కోసం ముందుగాఅజయ్ తనను సంప్రదించలేదట, సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆమే అజయ్ కి కాల్ చేయగా ఆమెను తీసుకోవడం జరిగిందని చెబుతోంది. ఎందుకంటే ఆమెకు అజయ్ భూపతి దర్శకత్వంలో నటించాలని ఉందని అందుకే అతడిని తరచూ క్యారెక్టర్ ఇవ్వమని అడుగుతూ ఉన్నానని కూడా చెబుతోంది.
కానీ అజయ్ మాత్రం నీతో చేయిస్తే బలమైన పాత్ర చేయించాలి కానీ చిన్నా చితక క్యారెక్టర్ కాదని అనేవాడట. అలా అడుగుతూ అడుగుతూ ఉండగా ఈ అవకాశం తనకి వచ్చిందని చెబుతోంది పాయల్.
అజయ్ ఈ సినిమా కథ తనకు చెప్పగానే నచ్చేసిందని అంటోంది, వెంటనే తాను తన తల్లికి కాల్ చేసి, అమ్మా నేను అజయ్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నా అని చెప్పేశా అని అందట.
ఇక మనగలవారం సినిమా గురించి అందులో ఆమె క్యారెక్టర్ గురించి కూడా కొన్ని విశేషాలు చెప్పుకొచ్చింది. సినిమాలో బోలెడన్ని ట్విస్టులు ఉంటాయట, తరువాత సీన్ లో ఎం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించలేడట, ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు శైలు అని, అది నెగిటివ్ రోల్ కాదని అంటోంది.
ట్రైలర్ లో చూడ్డానికి అలా అనిపించినా ఆ కేరెక్టర్ ని సినిమాలో చుస్తే సానుభూతి కలుగుతుందని చెబుతోంది. పైగా ఆ కేరెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయట. ఇక ఆర్.ఎక్స్ 100 సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న కార్తికేయ గురించి కూడా పాయల్ కొన్ని విషయాలు పంచుకుంది.
ఆతను చాల మంచి వ్యక్తి అని, మరలా తనతో కలిసి నటించాలని ఉన్నప్పటికీ సరైన కథ దొరక్కపోవడంతోనే ఆ కాంబినేషన్ కుదరలేదని అంటోంది. అలాంటి మంచి కథ దొరికితే కార్తికేయతో మరో సారి తెర పంచుకోవడానికి తానెప్పుడూ రెడీ అంటోంది పాయల్.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు తమిళ సినిమాలు ఒక తెలుగు సినిమా కూడా ఉంది. శుక్రవారం నాడు మంగళవారం సినిమా ప్రేక్షకుల ముందుకి రానుండగా ఈ సినిమాకి అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.
మధుర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై సంయుతంగా నిర్మించిన ఈ సినిమాకి గునుపాటి స్వాతి రెడ్డి, సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మాతలుగా వ్యవహరించారు.