Pending Challan: వాహనదారులకు బంపరాఫర్ కానీ ఈరోజే లాస్ట్ డేట్.

Bumperfarer for motorists but today is the last date.

Pending Challan: భలే మంచి చౌక బేరము, సమయము మించిన, దొరకదు త్వరం పాడుడి సుజనులార, ఏంటి శ్రీ కృష్ణ తులాభారం లోని పాట పాడుతున్నాను అని చూస్తున్నారా ?

మరేం లేదండి, ఎవరైనా మాంచి డిస్కౌంట్ ఇచ్చినా బంపరాఫర్ ఇచ్చినా ఇలాంటి మాటలు చక్కగా సరిపోతాయని చెప్పను, అన్నట్టు ఇపుడు అంతటి బంపరాఫర్ ఎవరిచ్చారు

, ఎవరిచ్చారు, మనకి కూడా ఆ ఆఫర్ వర్తిస్తుందా అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే.. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు

ఉల్లంఘించినా(Violation Of Traffic Rules), లైసెన్స్ లేకుండా దొరికిపోయినా, హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపినా, మితిమీరిన వేగంతో వాహనం నడిపినా

లేదంటే మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా ఇది మీకు ఉపయోగ పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) వాళనలపై ఉన్న పెండింగ్ చలాన్లకి టాప్ లెవల్ లో డిస్కౌంట్ ఇచ్చింది.

కానీ అందుకు కొన్ని రోజులు మాత్రమే గడువు పెట్టింది. ఆ గడువు లోపు మాత్రమే చలాన్లను క్లియర్ చేసుకోవాలి, లేదంటే ఆ డిస్కౌంట్ వర్తించదు.

challans 1 Pending Challan: వాహనదారులకు బంపరాఫర్ కానీ ఈరోజే లాస్ట్ డేట్.

అందులోను ఆ డిస్కౌంట్ కి జనవరి 10వ తేదీ ఆఖరు తేదీ. అంటే ఈ రోజే ఆఖరు రోజు. కాబట్టి ఎవరైతే తమ తమ వాహనాలపై చలాన్లను కడదాములే అని పెండింగ్ లో పెట్టుకున్నారో వారు ఇప్పుడే ఈరోజే క్లియర్ చేసుకోవడం ఉత్తమం.

ఎవరెవరికి ఎంతెంత డిస్కౌంట్ : Discount Details

ఇక ఈ డిస్కౌంట్ లు వాహనాలను బట్టి ఉంటాయి. తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకు పూర్తి వివరాలను కూడా ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు(RTC Busses),

తోపుడు బండ్ల పై ఉన్న చలాన్లకి 90 శతం డిస్కౌంట్ ను ఇచ్చారు. కేవలం 10 శాతం మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే వారి వాహనాలపై ఎటువంటి పెండింగ్ చలాన్లు లేకుండా చేసుకునే వీలుంటుంది. ఆతరువాత ఆ స్థాయిలో డిస్కౌంట్ ను ద్విచక్ర వాహనదారులకు(Two Wheelers) కల్పించారు.

టూ వీలర్స్ పై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. కాబట్టి బైకర్స్ ఈ విషయంలో ఇవాళే తొందర పడటం ఉత్తమం. ఫోర్ వీలర్స్(Four Wheelers)

అండ్ ఆటోస్(Autos) కి 60 పర్సెంట్ తగ్గింపు ఇచ్చింది రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు. ఆతరువాతి స్థానంలో ట్రక్కులు(Trucks) లారీలు(Lorry’s) ఉన్నాయి. వీటికి 50 శాతం తగ్గింపు వర్తిస్తుంది.

లక్షల్లో చలాన్లు కోట్లలో ఆదాయం : Lakhs Of Chalans Crores Of Rupees

అయితే ఇక్కడ ఒక విషయం గమయించాలి, ఈ ఆఫర్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల వారికి వర్తిస్తుంది. కానీ దీనిని 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10 వ తేదీ వరకు ఇచ్చారు.

అంటే 2023 డిసెంబర్ 26వ తేదీ లోపు ఉన్న చలాన్లకి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఆతరువాత పడిన చలాన్లకి ఈ డిస్కౌంట్ వర్తించదు.

అయితే ఈ చలాన్ల చెల్లిపు కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మీ సేవ కేంద్రాలు(Mee Seva Centers), యుపిఐ(UPI) ద్వారా కూడా చెల్లించవచ్చు.

ఇప్పటికే అనేకమంది తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేసుకున్నారు. లక్షల సంఖ్యలో పెండింగ్ లో ఉన్న ఈ చలాన్ల పేమెంట్ తో ప్రభుత్వానికి ఇప్పటికే కోట్లలో ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది.

Leave a Comment