People Fires On Shoyab Malik New Wife : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza), పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్(Shoaib Malik) ల వివాహ జీవితం విహాభిన్నం అయింది అని జనాలకు తెలిసిందే షోయబ్ తాజా భార్య సనా జావేద్ వల్ల(Sana Javed). ఆమె తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం వల్లనే సానియా షోయబ్ కి ఖుల్లా చెప్పిందని బయటకు వచ్చింది.
కొన్ని కారణాల వల్ల షోయబ్ తో కలిసి ఉండటానికి ఇష్టపడని సానియా ముస్లిం సంప్రదాయం ప్రకారం మహిళలకు ఉండే వెసులుబాటును ఉపయోగించుకుని భర్త నుండి విడిపోయింది. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన నాటి నుండి సనా జావేద్ పై సానియా సానుభూతిపరులు మండిపడిపోతున్నారు.
(People Fires On Sana javed) అందుకు తార్కాణమే తాజా సంఘటన. సనా జావేద్ ఈ మధ్య ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పైగా ఈ ఫోటో వారి వివాహ బాదం బయటి ప్రపంచానికి బహిర్గతం అయినా తరువాత పోస్ట్ చేసిన ఫోటో. దీంతో నెటిజన్లు సనా జావేద్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.
సనా కి షోయబ్ ఎన్నో భర్త – షోయబ్ కి సనా ఎన్నో భార్య : Sana And Shoaib Marital Information Is Quite Interesting
సనా జావేద్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోకి రెండు లక్షల లైకులైతే వచ్చాయి, కానీ కామెంట్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఒక్కో నెటిజన్ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
ఒకరు సానియా కాపురంలో నిప్పులు పోశావని అంతుంటే, మరొకరు రెండు ముఖాల మనుషులు ఉంటారని కామెంట్ చేశారు. ఇంకొకరు స్పందిస్తూ మహిళవయి ఉండి కూడా ఇంకో మహిళా జీవితాన్ని నాశనం చేశావు అంటూ నిలదీసారు.
మరొకరైతే ఒక అడుగు ముందుకేసి మీ వివాహం సరికాదని అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లు అసలు సనా జావేద్ చదివిందో లేదో కానీ వారు మాత్రం తమ తమ అభిప్రాయాలను కుండా బాద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు.
ఇక సనా జావేద్ చుస్తే ఆమె ఒక పాకిస్తానీ నటి, మోడల్ కూడా. మరో విశేషం ఏమిటంటే ఈ కుటుంబానికి హైదరాబాదీ మూలాలు ఉన్నట్టు సమాచారం.
షోయబ్ మాలిక్ కి సనా జావేద్ మూడో భార్య కాగా, షోయబ్ మాలిక్ సనా జావేద్ కి రెండవ భర్త, ఆమె మొదటి భర్త పేరు ఉమిర్ జాస్వాల్(Umir Jaswal) .
షోయబ్ మాలిక్ అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui) అనే మహిళను వివాహం చేసుకున్నాడు, ఆమెకు 2010 ఏప్రియల్ నెలలో లో విడాకులిచ్చి, అదే సంవత్సరం అదే నెలలో సానియాను పెళ్లాడాడు. ఇప్పుడు తాజాగా సనా జావేద్ తో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు.