రామమందిరం పై పాక్ జండా పెట్టాడు – అరెస్ట్ అయ్యాడు : Person Kept Pakistan Flag On Ayodhya Rama mandir

website 6tvnews template 85 రామమందిరం పై పాక్ జండా పెట్టాడు - అరెస్ట్ అయ్యాడు : Person Kept Pakistan Flag On Ayodhya Rama mandir

Person Kept Pakistan Flag On Ayodhya Rama mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి నోచుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Mode) మందిరాన్ని ప్రారంభించి, బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠచేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు రామ జన్మ భూమిలో రామ మందిరాన్ని నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా ప్రముఖులు తరలివచ్చారు. లక్షలాదిగా సామాన్య భక్తులు వచ్చారు.

కేవలం అయోధ్య(Ayodhya)లోని కాక భారత దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభా వెళ్లి విరిసింది. ప్రపంచంలోని అన్ని దేశాల మాట అటుంచితే పాక్ దేశం9Pakistan), పాకిస్తాన్ దేశ మద్దతుదారులు మాత్రం రామ మందిర నిర్మాణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. రామ మందిర నిర్మాణం పై విషాన్ని వెళ్ళగ్రక్కుతున్నారు.

దీనిని తార్కాణంగానే ఒక ఘటన చోటుచేసుకుంది. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం పై పాకిస్తాన్ జండాను గ్రాఫిక్స్ సహాయంతో పెట్టాడు ఒక వ్యక్తి. పైగా దానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.పైగా దానికి బాబ్రీ మసీద్(Babri masjid) అని పేరు కూడా పెట్టాడు.

ఇక చెప్పేదేముంది ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని గమనించిన రామ భక్తులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దీనిని ఎవరు పోస్ట్ చేశారా అని పరిశీలిస్తే విషయం బయట పడింది. ఈ పని చేసింది కర్ణాటక(Karnataka) రాష్ట్రం లోని గదగ్ జిల్లా కి చెందిన వ్యక్తి అని తేలింది.

అతని పేరు తాజుద్దీన్ దఫెదార్, అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా తానె ఈ పని చేసినట్టు ఒప్పుకున్నాడు. తానుం ఆ ఫోటోను ఎడిట్ చేసి ఫేస్ బుక్ లో పెట్టుకున్నానని, అయితే పొరపాటుగా షేర్ చేసాయడంతో అది వైరల్ అయిందని పేర్కొన్నాడు.

Leave a Comment