Delivery boy rides horse to deliver order: పెట్రోల్ కష్టాలు..గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ.


Petrol difficulties..go on horse and order delivery.

Delivery boy rides horse to deliver order: పెట్రోల్(petrol) లేకపోవడంతో కౌబాయ్ లా మారిపోయాడు ఫుడ్ డెలివరీ బాయ్(Food Delivery Boy). పైగా గుర్రంపై జొమాటో బాగ్(Zomato bag) తగిలించుకుని వెళుతున్న అతగాన్ని రోడ్డుపై అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కొందరు అతడిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోను తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోనే ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది(Viral Video). అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది ఒక్కసారి తెలుసుకుందాం.

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది : Why this situation has arisen

జనవరి 2వ తేదీ నుండి హైదరాబాద్ (Hyderabad)లో పెట్రోల్ కోసం పెద్ద పెద్ద యుధాలే జరిగిపోతున్నాయి, పెట్రోల్ బంకుల(Petrol Filling Stations) వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లలో జనం బారులు తీరి కనిపిస్తున్నారు.

టూ వీలర్లు, కార్లు చిన్న తరహా బస్సులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాయి. డిసెంబర్ 3 నుండి ఒక మూడు రోజుల పాటు పెట్రోల్ బంకులు ఉండవు అన్న మాట ఊపందుకోవడం తో ఎవరికీ వారు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు.

రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ క్షణమే జాగ్రత్త పడటం మొదలు పెట్టారు. మనలో చాలావరకు ఆఫీస్ కి వెళ్ళడానికి, లేదంటే చిన్న చిన్న అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళడానికి మాత్రం వాహనాలను ఉపయోగిస్తాం.

అయితే కొందరు బ్రతుకు తెరువుకోసం వాహనాన్ని వాడుతూ ఉంటారు. వారిలో ముఖ్యంగా ఫుడ్ డెలివరీ(Food Delivery) చేసే జొమాటో(Zomato), స్విగ్గి(Swiggy) వంటివారిని, అలాగే కొరియర్ బాయ్స్ ను(Courier Boys), అలాగే మెడిసిన్స్ సప్లయ్ చేసే వారిని చెప్పుకోవచ్చు.

చట్టాన్ని సవరించడం తో కొత్త కష్టం : A new difficulty with amending the law

1704259595935 Delivery boy rides horse to deliver order: పెట్రోల్ కష్టాలు..గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ.

హిట్ అండ్ రన్(Hit And Run) కేసుకి సంబంధించి కొత్తగా శిక్షను అలానే జరిమానాను అమాంతం పెంచేస్తూ కొత్త చట్టాలను ప్రవేశపెట్టడాన్ని లారీ, ట్రక్ డ్రైవర్లు(Truck Drivers),

బస్ డ్రైవర్లు(Bus Drivers), క్యాబ్ డ్రైవర్లు(Cab Drivers) తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.

కాబట్టి పెట్రోల్ బంకులకు ఆయిల్ సప్లై చేసే ఆయిల్ ట్యాంకర్లు(Oil tankers) కూడా కదలకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరి పెట్రోల్ లేకపోతె డెలివరీ బాయ్స్ బ్రతుకు బండి నడవదు, అయితే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు.

పెట్రోల్ డీజిల్ వాహనాలు, మరయంత్రాలు లేని రోజుల్లో మానవుడు రవాణాను ఎలా కొనసాగించాడు అనే దానిపవు లోతుగా ఆలోచించాడు. ఆ ఆలోచనే అతగాడిని గుర్రం పై సవారి(Horse Ride) చేసేలా చేసింది.

జొమాటో బ్యాగ్ వీపుకి తగిలించుకున్నాడు. గుర్రం ఎక్కాడు. మొబైల్ లో డెలివరీ ఆర్థర్ తీసుకున్నాడు. గుర్రం పైకి ఎక్కు కళ్లన్నీ పట్టుకుని అదిలించాడు. వెంటనే గుర్రం రోడ్డుపైకి పరుగులు తీసింది.

Leave a Comment