Afflicted with planets: గ్రహబాధలున్నవారు ఇది అస్సలు మిస్సవ్వకండి.

Planet afflicted do not miss this at all.

Afflicted with planets: గ్రహబాధలున్నవారు ఇది అస్సలు మిస్సవ్వకండి.

మానవజీవితాన్ని నవగ్రహాలు ప్రభావితం చేస్తాయి. మన జాతకచక్రంలోని పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు అన్నీకూడా నవగ్రహాల ఆధిపత్యంలో ఉంటాయి. అలాగే ఈ నవగ్రహాలు అన్నీ కూడా దశమహా విద్యా దేవతల ఆధీనంలో ఉంటాయని చెప్పుకోవచ్చు..

ఈ దేవతల ఉపాసన వలన జాతకంలో ఉండే చెడు ఫలితాలను తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఏదేవతా స్వరూపం ఏ గ్రహంపైన తన ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం.

కాళీమాత

దశమహావిద్యలలో మొదటి దేవీ అయిన కాళీ మాత శనిగ్రహానికి ఆదిపత్యం వహిస్తుంది. శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రముల పై ప్రభావం చూపిస్తుంది.

అత్యంత కష్టసాధ్యమైన పని అయినప్పటికీ, ఆలస్యంగా అయినా సరే మేలైన ఫలితాన్ని అనుకూల అనుగ్రహాన్ని ఇవ్వగలిగే శక్తి కాళీ మాత లో ఉంది.. పైకి కఠినంగా , తామసిక లక్షణాలతో కనిపించినా ఆమె కారుణ్య స్వభావాన్ని కురిపించే కరుణమూర్తి కాళీమాత.

తారాదేవి

తారాదేవి జ్ఞానము అనుగ్రహించే సరస్వతీదేవి స్వరూపంగా చెప్పవచ్చు తారా దేవి గురు గ్రహంపైన ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వాభాద్ర పైన ప్రభావం చూపిస్తుంది సాత్విక తత్వం కలిగినది ఈ తల్లి.

అత్యంత శుభఫలితాలనిస్తుంది. ఈ తల్లి ఆరాధన వల్ల జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొని శాశ్వతంగా పరిష్కరించుకోగల శక్తి కలుగుతుంది.

భువనేశ్వరీ దేవి

భువనేశ్వరి దేవి అనుగ్రహం చంద్ర గ్రహం పైన ఉండి, రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రములపై ప్రభావాన్ని చూపిస్తుంది. రాజసిక సాత్విక గుణముల మిశ్రమంగా ఉండి మంచి-చెడు లక్షణములను నియంత్రిస్తూ ఉంటుంది.

బగళాముఖి దేవి

బగళాముఖి దేవి కుజగ్రహంపైనా అంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రముల పై తన ప్రభావం చూపిస్తుంది. రాజసిక ప్రవృత్తి కలిగి ఉంటుంది.

ఛిన్నమస్తా దేవి

ఛిన్నమస్తా దేవి రాహు గ్రహానికి ఆదిపత్యం వహిస్తుంది. ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రం పై ప్రభావం చూపిస్తుంది. ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ తల్లిని పూజిస్తే… ఆకాశమే హద్దుగా అనేక వరాలను కురిపిస్తుంది.

త్రిపురభైరవి దేవి అనుగ్రహం రవిగ్రహంపైనా, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములపై వుంటుంది. రాజసిక ప్రవృత్తి కలిగి ఉంటుంది.

కమలాత్మిక దేవి ప్రభావం శుక్ర గ్రహం నక్షత్రాలైన భరణి పుబ్బ పూర్వాషాఢలపై ప్రభావం చూపిస్తుంది సాత్విక తత్వంతో అనుగ్రహించే దేవి ఈతల్లి. సకల సంపదలు, సౌభాగ్యాలు కావాలంటే ఈ దేవతని ఆరాధించాలి.

ధూమవతి దేవి

ధూమవతి దేవి కేతు గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది, అశ్విని మఖ మూల నక్షత్రములకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. వివిధ దశలలో ఆటంకాలను కలిగించినప్పటికీ, వైరాగ్య భావన తో ఆధ్యాత్మిక చింతన కలిగించి మానవులను మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది.

మాతంగి దేవి

మాతంగి దేవి బుధ గ్రహం పైన ఆదిపత్యం కలిగి ఉండి ఆశ్లేష జ్యేష్ట రేవతి పైన ప్రభావం చూపిస్తుంది ఉంది. ఈమె కూడా మిశ్రమ ప్రవృత్తి కలిగి ఉంటుంది.

లలితా త్రిపుర సుందరి దేవి

లలితా త్రిపురసుందరీ దేవిని ఆరాధించడం వల్ల లగ్నంలో ఏదైనా చెడుఫలితాలు ఉంటే తొలిగిపోతాయి. ఇలా ఏ గ్రహమైతే అనుకూలంగా లేదో ఆ గ్రహానికి అధిష్టాన దేవతలను పూజించడం వల్ల వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది, జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోగలం.

Leave a Comment