PM Kisan 15th Release: పీఎం కిసాన్ 15 వ విడత నగదు విడుదల ఎప్పుడంటే

PM Kisan 15th Release

PM Kisan 15th Release : పీఎం కిసాన్ 15 వ విడత నగదు విడుదల ఎప్పుడంటే..పీఎం కిసాన్ నగదు మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఎం చేయాలో తెలుసా..

హలం పట్టి పొలం దున్ని పంట పండించే రైతు దేశం ఆకలిని తీరుస్తాడు. తాను బ్రతుకుతూ నలుగురిని బ్రతికిస్తాడు. అందుకే ప్రభుత్వాలు కూడా శక్తిమేరకు రైతులకు ఏదో విధంగా లబ్ది చేకూర్చాలని కృత నిశ్చయంతో ఉంటాయి.

రైతుల కోసం, వారి క్షేమం కోసం అనేక సంక్షేమ పధకాలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాయి. ఇటువంటి సంక్షేమ పధకాలతో అయినా రైతుకి కొంత ఆర్ధిక వెసులుబాటు కలుగుందని వారి ఉద్దేశం, ఈ క్రమంలోనే కేంద్రం లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తోంది.

రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి లేదంటే ఎరువులు కొనుగోలు చేయడానికి వీలుగా ఆరు వేల రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా జమ జేస్తోంది.

ఇలా మూడు విడతల్లో అందజేయడం వల్ల వారి వ్యవసాయ పనుల కోసం అవి ఉపయోగపడతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఈ మొత్తాన్ని నేరుగా లబ్దిదారులైన రైతుల బ్యాంకు ఖాతాలోనే జమచేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ సారి అందబోయేది 15 వ దఫా అని చెబుతున్నారు. రైతులకు ఈ మొత్తాన్ని దీపావళి తరువాత అందజేసే వీలుంటుందని తెలుస్తోంది.

అయితే లబ్దిదారులైన రైతులు ఇక్కడ ఒక చిన్న విషయాన్నీ గమనించాలి, రైతులు మీ పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాతో.. ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం తప్పనిసరి అని అంటున్నారు. ఆధార్‌తో బ్యాంక్ వివరాలను లింక్ చేయడానికి eKYC చేయడం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇలా EKYC ని అప్ డేట్ చేసిన రైతుల ఖాతాలోనే డబ్బు జమ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 15వ విడత డబ్బు కావాలనుకునే రైతులు వెంటనే EKYC ని చేయించుకుని తీరాలి.

ఈ eKYC ని చేయించడం కూడా పెద్ద కష్టతరమైన పని కాదని నిపుణులు అంటున్నారు. eKYC చేసుకోవడం కోసం PM-KISAN పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ లింక్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

అక్కడ మన ఆధార్ కార్డ్ లో ఉండే 12 నెంబర్లను ఏమాత్రం తప్పులు దొర్లకుండా ఎంటర్ చెయ్యాలి, అప్పుడు సదరు ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది.

అలా వచ్చిన ఓటీపీ ని వెంటనే పోర్టల్లో ఎంటర్ చెయ్యాలి. అప్పుడు మన EKYC ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ విధానం కష్టంగా ఉందని భావించిన వారు మరో మార్గాన్ని అనుసరించవచ్చు. eKYC పద్దతిని ని మన మొబైల్ లో కూడా పూర్తిచేయవచ్చు అందుకోసం మన మొబైల్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి PMKISAN GOI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత eKYC ప్రక్రియ చేసుకోవచ్చు.

ఇక మరో మార్గం ఏమిటంటే, ఏటీఎం సెంటర్. మనకి దగ్గరలో ఉన్న ఏదైనా ఏటీఎం సెంటర్ కి వెళ్లి ఆధార్ ను అకౌంట్‌తో లింక్ చేయవచ్చు. లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డును ఏటీఎంలో స్వైప్ చెయ్యాలి. ఆతరువాత యధావిధిగా పిన్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.

అప్పుడు స్క్రీన్ పై వచ్చిన అషన్లలో సర్వీసెస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆతరువాత రిజిస్ట్రేషన్‌ను సెలెక్ట్ చేయాలి. తదుపరి మన బ్యాంకు ఖాతాకు సంబంధించి రెండు అప్షన్లు చూపిస్తుంది.

మన బ్యాంకు సేవింగ్స్ ఎకౌంటా, లేక కరెంట్ అకౌంటా అని అడుగుతుంది. అందులో మన బ్యాంకు ఎకౌంట్ ఏదైతే అది ఎంటర్ చెయ్యాలి.

ఆ తరువాత ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసేందుకు ఆప్షన్ వస్తుంది, వెంటనే 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే, మన ఆధార్ నెంబర్ కి లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కి ఓటీపీ నెంబర్ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ ను ఎంటర్ చేసిన వెంటనే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయబడినట్లు మెసేజ్ వస్తుంది.

కాబట్టి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నగదు అందుకునేందుకు EKYC చేయించుకోవాలని రైతన్నలు గమనించండి.

Leave a Comment