PM Vishwakarma Scheme: 3 లక్షలు కావాలా, మరి 18 సంవత్సరాలు నిండాయా – ఇలా చెయ్యండి

prime minister scholarship scheme 2 PM Vishwakarma Scheme: 3 లక్షలు కావాలా, మరి 18 సంవత్సరాలు నిండాయా - ఇలా చెయ్యండి

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ భారత ప్రభుత్వం వారి చే P.M.V.K.Y. అనే స్కీం అంటే పి.ఎం.విశ్వకర్మ యోజన పధకం క్రింద రుణాలు ఇచ్చి ఆయా రంగాలలో నిపుణుల చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించి, అడ్వాన్సెడ్ టూల్స్ మరియు డిజిటల్ ట్రాన్సాక్షన్ లకు ఇన్సెంటివ్స్ వంటి ప్రోత్సాహం అందించి నిరుద్యోగులను ఆదుకోవడానికి ఈ పధకం తీసుకొచ్చింది.

P.M.V.K.Y. స్కీం – పధకాల వివరాలు

ఇందులో అన్ని రంగాలను అభివృద్ధి చెయ్యడానికి అవసరమైన ప్రణాళికలను తయారుచెయ్యడం, చిన్న చిన్న పరిశ్రమలకు అలాగే చేతివృత్తుల వారికి అండగా ఉండడం చేస్తుంది. ముఖ్యం గా సాంప్రదాయ కళాకారులు తో పాటు చేతి వృత్తి పనులు చేసుకునేవారికి ఉపయోగపడే విధంగా సెప్టెంబర్ 17, 2023 సంవత్సరంలో ” ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ” పధకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అంతే కాకుండా హస్త కళాకారులను కుడా ఈ పధకం క్రిందకి తీసుకువచ్చి వారిని ఆర్ధికం గా ఎదగడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంది. ఇంకా వారికి వారు తయారుచేసిన వస్తువులకు తామే మార్కెటింగ్ సదుపాయం కలిగించడం తో పాటు వారి నైపుణ్యాల కొరత తీర్చేందుకు సుమారు 13,000 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది.

ఈ పధకానికి తగిన అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు చేసే విధానం అన్ని క్రింద ఇవ్వబడ్డాయి

1.ఈ పిఎం విశ్వకర్మ యోజన పధకాన్ని మైక్రో మరియు స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ సంస్ధ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. రుణాలను సమకూర్చడం తో పాటు వారికి అవసరమైన శిక్షణ, అడ్వాన్సెడ్ టూల్స్ , ఇంకా డిజిటల్ ట్రాన్సక్షన్స్ లకు ఇన్సెంటివ్ ఇవ్వడం ఇలాంటి సదుపాయాలను ఇవ్వడమే కాకుండా వారిని ప్రోత్సహించి తగిన సూచనలు ఇస్తుంది. దేశీయం గాను అంతర్జాతీయం గాను జరిగే అన్ని వ్యవహారాలలో వారిని భాగస్వామ్యులు గా చెయ్యడానికి అవసరమైన టెక్నోలజి ఉపయోగించి కళాకారులను తగు విధంగా సిద్ధం చేస్తుంది.

2.దీనికి కావాల్సిన అర్హతలు దరఖాస్తు చేసే సమయానికి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. తగిన రంగాలలో వారు తమ చేతివృత్తి పనులలో పనిచేసిన వారై ఉండాలి. ఇంతకుముందే వారు స్వయం ఉపాధి పొందుతూ ఉంటె వారు కుడా ఈ పధకం లో చేరడానికి అర్హులు గానే పరిగణిస్తారు. ఈ పధకం క్రింద ప్రస్తుతం 18 ట్రేడ్ లను చేర్చడం జరిగింది.

3.దీని వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే మొదట అందరికి ప్రాధమిక శిక్షణ తో పాటు చేతివృత్తి పనివారికి, హస్తకళాకారులకి వారిలో ఉన్న నైపుణ్యం గుర్తించి వారికి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ తో పాటు ఐడి కార్డులను ఇవ్వడం జరుగుతుంది. ఈ పధకం లో చేరిన అభ్యర్ధులకు రోజుకు 500 రూపాయలు స్టైఫెండ్ తో 5 రోజులనుండి 7 రోజుల వరకు వారికి ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. దీంతో పారు దీనికి అవసరమైన అడ్వాన్సెడ్ టూల్స్, డిజిటల్, ఫైనాన్సు స్కిల్ల్సు , ఎంటర్ ప్రేన్యుర్ షిప్, క్రెడిట్ సపోర్ట్ సిస్టం, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్స్ వంటి పలు అంశాల పై వారికీ ట్రైనింగ్ ఇస్తారు.

4.అడ్వాన్సెడ్ ట్రైనింగ్ వివరాలు చూసినట్లయితే వారికి బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అనంతరం వారికి రోజుకు 500 రూపాయలు స్టైఫెండ్ ను ఇచ్చి అడ్వాన్సెడ్ కోర్సులలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. లేటెస్ట్ టెక్నోలజి, డిజైనింగ్ తో పాటు పలు రకాల ఇండస్ట్రీస్ లలో వారిని అనుసంధానం చెయ్యడం ద్వారా అక్కడ జరిగే కార్యకలాపాలపై ఒక అవగాహన కల్పించి వారికి సెల్ఫ్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ నెలకొల్పే విధం గా తీర్చి దిద్దటం చేస్తారు.

5.టూల్ కిట్ల లో ప్రోత్సాహం ఇవ్వడం వారి చేతివృత్తుల లో ఉండే నైపుణ్యాల ను చూసిన తర్వాత వీరి వ్యాపారానికి తగిన టెక్నోలజి తో తమ స్కిల్స్ పెంచుకోవడం కోసం వారికి 15,000 రూపాయలను టూల్ కిట్ ఇన్సెంటివ్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తారు.

6.ఫైనాన్సు సదుపాయం కోసం వారు ప్రాధమిక శిక్షణ కంప్లీట్ చేసిన చేతివృత్తుల వారికి 18 నెలల రీపేమేంట్ చేసే సమయకాలం తో 1 లక్ష వరకు వారికి ఎలాంటి పూచికత్తు లేకుండానే ఫైనాన్సు లోన్ ఇస్తారు. వారు ప్రామాణిక రుణ ఖాతా నిర్వహించడం, అలాగే డిజిటల్ లావాదేవీల కోసం అడ్వాన్సెడ్ ట్రైనింగ్ తీసుకున్న వారికి రెండో ఇన్స్టాల్ మెంట్ క్రింద 2 లక్షల రూపాయల వరకు వారికి లోన్ మంజూరు చేస్తారు. అయితే ఈ లోన్ తీసుకోవాలంటే ముందుగా ప్రారంభ స్టేజి లో ఒక 1 లక్ష లోన్ చెల్లించాల్సి ఉంటుంది.

7.డిజిటల్ ట్రాన్సాక్షన్ లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది లావాదేవీల కోసం చేతివృత్తి పనుల వారికి ప్రతీ లావాదేవీకి ఒక రూపాయి చొప్పున లెక్కన నెలవారీ 100 లావాదేవీలను వారికి ఇన్సెంటివ్ గా అందజేస్తారు.

8.చేతివృత్తుల వారు తాము తయారుచేసిన ప్రోడక్ట్ లకు తగిన మార్కెటింగ్ ఏ విధం గా చేసుకోవాలనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం చేపడతారు. నాణ్యతను సర్టిఫై చెయ్యడం, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఇ- కామర్సు, GeM ప్లాట్ఫారం ఆన్ బోర్డింగ్, ఇంకా ప్రకటలు, పబ్లిసిటీ ఎలా ప్లాన్ చేసుకోవాలో తదితర అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

9.రిజిస్ట్రేషన్ విధానం చూసినట్లయితే మనం ముందుగా పిఎం విశ్వకర్మ వెబ్ సైట్ అయిన HTTPS://PMVISHWAKARMA.GOV.IN లో లాగిన్ అయ్యి అందులో హోమ్ పేజి లోకి వెళ్ళి ” హౌ టు రిజిస్ట్రేషన్ ” అనే పదం మీద క్లిక్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ తో పాటు ఆధార్ KYC కి సంబందించిన అన్ని వివరాలు ఇవ్వాలి. దీంతో పాటు ఆర్టీ షియన్ రిజిస్ట్రేషన్ ఫాం ఓపెన్ చేసి ఇందులో కుడా తమ వివరాలు ఎంటర్ చెయ్యాలి. ప్రక్రియ పూర్తి అయిన తర్వాత PM విశ్వకర్మ డిజిటల్ ఐడి తో పాటు సర్టిఫికేట్ కుడా డౌన్ లోడ్ చేసుకోవాలి. తారవాత మళ్ళి స్కీమ్ కాంపోనెంట్ కోసం దరఖాస్తు చెయ్యడం తప్పనిసరి.

10.ఈ పధకం క్రింద చేరగోరే లభ్దిదారులను సెలెక్ట్ చెయ్యడానికి వెరిఫికేషన్ ప్రక్రియ మూడు స్టేజిల్లో ఉంటుంది. మొదటి స్టేజ్ లో గ్రామ పంచాయతి లేదా యూఎల్ బి స్ధాయిలో దృవీకరణ చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత జిల్లా అమలు కమిటీ దానిని వెరిఫికేషన్ చేసి సిఫార్సు చెయ్యడం జరుగుతుంది. ఇక ఫైనల గా స్క్రీనింగ్ కమిటీ దీనిని ఆమోదిస్తుంది. మీకు ఏమైన డౌట్స్ ఉన్నట్లయితే అభ్యర్దులు 18002677777 ఈ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా pm-vishwakarma@dcmsme.gov.in కు ఇ -మెయిల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Comment