Lost Phone Recovered: పోయిన ఫోన్లను పట్టుకుంటున్న పోలీసులు.

Police are catching the lost phones.

Lost Phone Recovered: పోయిన ఫోన్లను పట్టుకుంటున్న పోలీసులు.

ఫోన్ ఎవరైనా పోగొట్టుకుంటే ట్రాకింగ్ ద్వారా చాలా సులువుగా ఫోన్ లను పట్టుకుంటున్నారు పోలీసులు.
CENTRAL EQUIPMENT IDENTITY REGISTER PORTAL ద్వారా ట్రాకింగ్ లో ట్రేస్ అవ్వని ఫోన్లను బ్లాక్ చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో పోలీసులు ఏడు నెలల్లో దాదాపు 5,449 ఫోన్లను బ్లాక్ చేశారు. వాటిలో 1,318 ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పోలిస్ స్టేషన్ లలో CENTRAL EQUIPMENT IDENTITY REGISTER PORTAL USER ID లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సెల్ ఫోన్ కేసుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్ లను నియమించారు.బాదితుల ఫిర్యాదు మేరకు రామగుండం కమీషనరేట్ పరిధిలో 1813 ఫోన్ లను బ్లాక్ చేశారు.

జగిత్యాలలో 1030,రాజన్న సిరిసిల్ల జిల్లలో 1075 , కరీంనగర్ లో1531 ఫోన్లను బ్లాక్ చేశారు.
రామగుండం లో 888. జగిత్యాల లో 447, కరీంనగర్ లో 654, రాజన్న సిరిసిల్ల లో 465 ఫోన్ లను ట్రేస్ చేయగలిగారు.

ఈ ట్రాకింగ్ లో రామగుండం కమీషనరేట్ పరిధిలో 418, జగిత్యాల జిల్లాలో 157 , కరీంనగర్ లో 360, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 383 ఫోన్ లను పట్టుకొని బాధితులకు అప్పగించారు.

ఫోన్ పోగొట్టుకున్న, ఎవరైనా దొంగతనం చేసినా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, లేదా మీ సేవ సెంటర్ కి వెళ్ళి https//www.ceir.gov. in వెబ్సైటు లో అప్లై చేసుకోవాలని పోలీసులు తెలిపారు.

Leave a Comment