Police Found Rashmika Deep Fake Creator: రష్మిక డీప్ ఫేక్ క్రియేటర్ ఎవరో తెలిసిపోయిందోచ్

website 6tvnews template 66 Police Found Rashmika Deep Fake Creator: రష్మిక డీప్ ఫేక్ క్రియేటర్ ఎవరో తెలిసిపోయిందోచ్

Police Found Rashmika Deep Fake Creator: నేషనల్ క్రష్ న్ రష్మిక మందన్న(Rasmika Mandanna) డీప్ ఫేక్ వీడియోను ఒకప్పుడు ఎంతటి దుమారం రేపిందో అందరికి తెలుసు.

ఆ సమయంలో రష్మిక మనసు చాలా గాయపడింది, ఆమెకు బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రెటీలు అంతా బాసటగా నిలిచారు. ఈ వీడియో వైరల్ కావడం పై పోలీసు శాఖ, సైబర్ విభాగం సీరియస్ గా తీసుకుంది.

వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆ వీడియో రూపొందించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎక్కడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అతడిని ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో అదుపులోకి తీసుకున్నారు.

కానీ ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు నిందితుణ్ణి ఈమని నవీన్ గా గుర్తించారు. 24 సంవత్సరాల వయసున్న నవీన్ గుంటూరు(Guntur) జిల్లాకు చెందినవాడని వెల్లడైంది. నవీన్, రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి, దానిని సామజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేసినట్టు విచారణలో వెల్లడైందట.

తీగలాగితే ఏపీ లో దొరికాడు : Criminal Found In Andhra Pradesh

ఈ కేసు విషయంలో దేశవ్యాప్తంగా అనేకమంది సామజిక మాధ్యమాల ఖాతాదారులను ఇంటరాగేట్ చేసినట్టు పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఇలా ఒక్కొక ఆధారాన్ని పట్టుకుని గుంటూరు వరకు చేరుకున్న పోలీసులు మొత్తానికి నవీన్ ను పట్టుకున్నారు.

నవీన్ ను అదుపులోకి తీసుకుని వారి స్టయిల్ లో విచారించగా నేరాన్ని నవీన్ ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. నవీన్ రష్మికకు వీరాభిమాని అంట, ఆమె పేరు మీద ఫ్యాన్ పేజ్ లు కూడా క్రియేట్ చేశాడట.

ఆ అభిమానం వెర్రి తలలు వేయడం తోనే డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశాడు, కానీ విషయం సీరియస్ అవ్వడం, సెలెబ్రెటీస్ స్పందించడం తో దానిని ఇన్ స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు.

Leave a Comment