తెలంగాణా లో 17 పార్లమెంట్ స్దానాలకు పోలింగ్ – కౌంటింగ్ డేట్ ఫిక్స్

rajiv kumar1 తెలంగాణా లో 17 పార్లమెంట్ స్దానాలకు పోలింగ్ - కౌంటింగ్ డేట్ ఫిక్స్

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ తో పాటు 5 రాష్ట్రాలకు ఎన్నికల కు అలాగే కౌంటింగ్ కు తేదీలు ఖరారు చేసింది కేంద్ర ఎలక్షన్ కమీషన్. అయితే తెలంగాణా లో 17 పార్లమెంట్ స్దానలకు ఒక సమయం లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 7 విడతలలో ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది అని కమీషన్ తెలిపింది.

అందులో 4వ విడత లో తెలంగాణా లో 17 ఎంపి సీట్లకు పోలింగ్ డేట్ ను కమీషన్ ఫిక్స్ చేసింది. ఈరోజు నుండి ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చింది కమీషన్ ప్రకటించింది. తెలంగాణా లో మే 13 న పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబందించి ఏప్రిల్ 18 న ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తామని కమీషన్ చెప్పింది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్స్ స్వీకరిస్తామని ఏప్రిల్ 27 వ తేది వరకు నామినేషన్ లను ఉపసంహరణకు గడువు తేది గా నిర్ణయించింది.

జూన్ 4 న దేశ వ్యాప్తం గా ఓట్ల లెక్కింపు చేపడతామని ప్రకటన విడుదల చేసారు. ఇప్పటికే ఎలక్షన్ షెడ్యుల్ ఖారారు కావడం తో అన్ని పార్టీ ల మధ్య రాజకీయాలు హోరా హరీ గా మారుతున్నాయి. అయితే ఈ ఎన్నికలలను రేవెంత్ రెడ్డి చాల సీరియెస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీ లు గెలుపు గుర్రాల కోసం వెతకడం మొదలు పెట్టాయి. అలాగే సీటు కోసం పలు నేతలు ఎవరికీ వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు అయితే పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారు. అన్ని పార్టీలు తామే అధికారం చేపడతామని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేసున్నారు.

Leave a Comment