Pooja hegde confirmed for nandini reddy film samatha drop!! : సమంత వదులుకున్న ఆఫర్ ని చేజిక్కించుకున్న పూజా హెగ్డే,టిల్లుతో స్ర్కీన్ షేర్ కి సిద్దం.
ఢీజే టిల్లు తో బుట్ట బొమ్మ.. ”పూజా హెగ్డే” కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రిలో మెల్లగా కనుమరుగవుతున్న పేరు. అయితే మహేష్ బాబు గుంటూర్ కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ ల నుంచి తప్పుకున్న తర్వాత అసలు ఒక్క తెలుగు సినిమాకి కూడా సంతకం చేయలేదు. ఈ మద్యలో నాని తో సరిపోద శనివారం అనే సినిమాకీ పూజాని తీసుకోవాలనుకున్నారు కానీ, చివరికి ఆ చిత్ర నిర్మాతలు ప్రియాంక అరుల్ మోహన్ ని మెయిన్ లీడ్ గా కన్ఫర్మ్ చేసినట్టు తెలిపారు.
ఇక ఈ సినిమాలో పూజా ఉండదు అని తెలిసిన తర్వాత పూజా తెలుగులో విచిత్రంగా ఎలాంటి అవకాశాలు అందుకోలేదు. ఒకప్పుడు డేట్లు ఖాళీ లేక సినిమాలు వదులుకున్న పూజాకి తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఈ మద్యలో వస్తున్న కథనాల ప్రకారం డిజె టిల్లు సిద్దు జొన్నలగడ్డ సినిమాలో ప్రధాన పాత్రలో అవకాశం వచ్చినట్టు, పూజా హెగ్డే కూడా దానికి ఒప్పుకున్నట్టు తెలిసింది.
అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్ కోసం ముందుగా సమంత రూత్ ప్రభుని సంప్రదించినట్లు సమాచారం. సమంత అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలలుగా విశ్రాంతిలో ఉంది. ఇలాంటి సమయంలో ఆమె సినిమాలు చేయడానికి సిద్దంగా లేదు, అందువల్ల ఆమె స్నేహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డి ఆమె తీయబోయే చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ పక్కన పూజా హెగ్డేని నటించమని అడిగారు.
ఈ సినిమా కోసం పూజా హేగ్ధే భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిననట్టు సమాచారం, నిర్మాణ వర్గం కూడా దీనికి అంగీకరించడంతో ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. తెలుగు సినీ పరిశ్రమకి దూరంగా ఉన్న పూజా నటనకి మాత్రం దూరంగా లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసింది. సల్మాన్ ఖాన్ వంటి వారితో ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది.
ఈ మద్యలో బాలీవుడ్ ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆడకపోయినా, ఆమెకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. మోడెల్ గా కెరీర్ ని మొదలు పెట్టిన పూజ హెగ్డే 2010 లో జరిగిన విశ్వసుందరి పోటీలలో భారతదేశం తరుపున ఎంపిక చేసిన వారిలో 2వ స్థానంలో నిలిచింది. ”ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు తెరకి పరిచయం ఆయన ఈ నటి, మొదటి చిత్రంలోనే నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ మొదటి చిత్రం అయిన ముకుందలో నటించింది.
ఆ తర్వాత మొహెంజో దారో, దువ్వడా జగన్నాధం, రంగస్థలం, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గడ్డలకొండ గణేష్, హౌస్ ఫుల్ 4, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ వంటి చిత్రాలలో నటించింది. ఈ మద్యలో పూజా నటించిన భారీ చిత్రాలు రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వరుసగా పరాజయం పాలవడంతో మంచి హిట్ కోసం పూజా వెయిట్ చేస్తోంది. వరుస పరాజయాల తర్వాత తెలుగులో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి, వచ్చిన అవకాశాలు కూడా ఏవేవో కారణాల వల్ల పోయాయి, ఇలాంటి సమయంలో ఘన విజయంతో దూసుకెళ్తున్న సిద్దు జొన్నలగడ్డ పక్కన నటించే అవకాశం రావడంతో పూజా వెంటనే ఒప్పుకుంది.
రైటర్ గా ఇండస్ట్రిలో అదుకుపెట్టడానికి వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు వెళ్తున్నాడు. 2011లో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాలో ప్రధాన పాత్రతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. అంతకుముందు బీమిలీ కబడ్డీ జట్టు, జోష్, నారింజ రంగు వంటి చిత్రాలలో నటించినప్పటికి వాటిలో అంతా కీలక పాత్రలేం కాదు. వళ్ళినం అనే సినిమాతో తమిళంలో అడుగుపెట్టాడు.
ఆ తర్వాత 2016 లో గుంటూర్ టాకీస్, 2020 లో మా వింత గాధ వినుమా వంటి సినిమాలో నటుడిగా, సహ రచయితగా చేశాడు. ఇక 2022 లో వచ్చిన ఢీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ లో , విమల్ కృష్ణ దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వచ్చిన ఓ ప్రేమ కథ ఢీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటీ నటులుగా చేశారు. 2022 ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో నటుడిగా మాత్రమే కాదు, రచయితగా కూడా పని చేశాడు.
ఈ ఢీజే టిల్లు ఘన విజయం సాదించింది, ఇంతటితో ఆపకుండా ఈ ఢీజే టిల్లుకి సీక్వల్ పార్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్దంగా ఉంది. ప్రస్తుతం తెలుసు కదా, టిల్లు స్క్వేర్, నరుడి బతుకు నటన వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోయే సినిమాలో సిద్దు జొన్నలగడ్డ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా ఖరారయింది. పూజా హెగ్డే అబిమనులకు ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త.