మసీదులో పూజలు – వారణాసి కోర్ట్ సంచలన తీర్పు : Pooja In Gyanvapi – Sensational verdict of Varanasi Court

website 6tvnews template 2024 01 31T162625.324 మసీదులో పూజలు - వారణాసి కోర్ట్ సంచలన తీర్పు : Pooja In Gyanvapi - Sensational verdict of Varanasi Court

Pooja In Gyanvapi – Sensational verdict of Varanasi Court : జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) కేసు విషయంలో వారణాసి కోర్ట్(Varanasi Court) కీలక తీర్పును ఇచ్చింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతిని కోరుతూ కోర్టులో వేసిన వ్యాజ్యంలో హిందువులకు అనుకూలంగా కోర్టు తీర్పును వెలువరించింది.

జ్ఞానవాపి మసీదులో హిందువులు కూడా పూజలు చేసేందుకు అనుమతినిఇస్తూ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఇటీవలే ASI చేసిన సర్వే లో ఆ మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని స్పష్టమైనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వారణాసి కోర్టు ఈ మసీదుపై ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. Vyas Ka Tekhana ప్రాంతం వద్ద హిందువులు పూజలు చేసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

ఒక వారం రోజుల లోపుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని తెలిపింది న్యాయ స్థానం. ఈకేసును అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ హిందువుల తరపున టేకప్ చేశారు. ఈ తీర్పుపై కాశీ విశ్వనాథ్ ట్రస్‌ స్పందిస్తూ ఇది హిందువుల విజయమని చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

కోర్టు ఆదేశాకు కూడా ఉన్నాయి కాబట్టి, వారం రోజులలోనే మసీదులో పూజలు మొదలు పెడతామని కాశీ విశ్వనాథ్ ట్రస్‌ పేర్కొంది.

Leave a Comment