పూనమ్ పాండే(Poonam Pande) ఈ అమ్మడు సినిమాల విషయంలో బ్యాక్ బెంచ్ స్టూడెంటే అయినా కాంట్రవర్సీల విషయంలో మాత్రం ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అసలు కాంట్రవర్సీ అనేదానికి క్రియేట్ చేయడంలో ఆమెకు డిస్టింక్షన్ ఇవ్వోచ్చేమో.
ఈ మాటలు కాస్త విచిత్రంగా అనిపించొచ్చుగాని ఆమె ట్రాక్ రికార్డు చుస్తే మాత్రం అవును అని ఒప్పికొక తప్పదు. ఇప్పటికే అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వారాంతాల్లో నిలిచిన ఆమె ఇప్పుడు అందరికంటే పెద్ద ప్రాంక్ చేసి ప్రతి ఒక్కరిని వెర్రి వెంగళప్పలను చేసింది. పైగా చేసిన పని చాలదన్నట్టు దానికి కాన్సరూ, కాకరకాయ అంటూ కవరింగులు కూడా ఇస్తోంది.
2 న చనిపోయింది 3న బ్రతికింది : Dead On 2nd But Alive On 3rd
ఫిబ్రవరి రెండవ తేదీన పూనం పాండే చనిపోయింది అంటూ వార్త ఒకటి వైరల్ అయింది. కేవలం 32 సంవత్సరాల వయసులో ఆమెకు సర్వైకల్ కాన్సర్(Cervical Cancer) సోకిందని అది ముదిరిపోవడంతో ఆమె మరణించిందని వార్తలు వెలువడ్డాయి. చాలా వరకు న్యూస్ చేస్తోనేళ్లు, వెబ్ సైట్లు పూనమ్ పాండే కన్ను మూసింది, పూనమ్ పాండే ఇక లేరు, పూనమ్ పాండే రెస్ట్ ఇన్స్ పీస్ అంటూ పెద్ద పెద్ద హేండ్డింగ్లతో వార్తలు ప్రసారం చేశాయి. కానీ ఫిబ్రవరి మూడో తేదీన ఆమె స్వంతంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. తానూ చనిపోలేదని బ్రతికే ఉన్నానని వెల్లడింది.
ఫూల్స్ చేయడానికి కారణం అదేనట : Reason Behind To Make Fools
అసలు తాను చనిపోయానని చెప్పడానికి ప్రధాన కారణం కాన్సర్ అని అంటోంది ఈ 32 ఏళ్ళ ముదురు భామ. మన దేశంలో ఎంతో మంది మహిళలు కాన్సర్ మీద మరీ ముఖ్యంగా సర్వైకల్ కాన్సర్ మీద అవగాహన లేక చనిపోతున్నారని చెప్పుకొచ్చింది. తానూ సర్వైకల్ కాన్సర్ తో చనిపోయానని చెబితేనైనా ఆ కాన్సర్ గురించి వెతకడం మొదలు పెడతారని అప్పుడైనా వారికి దాని పట్ల అవగాహనా వస్తుందని ఆమె అనుకుందట. అందుకే చనిపోయినట్టు ప్రాంక్ చేశానని అంటోంది.
కొందరు ఈ వార్తలు నమ్మలేదు : Some people Did Not Believe That News
అందరిని ఫూల్స్ ను చేశానని పూనమ్ సంబరపడుతుందేమో కానీ, కొంతమంది మాత్రం ఆమె మరణ వార్తను నమ్మలేదు. అసలు పూనమ్ నిజగానే కాన్సర్ తో మరణిస్తే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన ఆసుపత్రి వద్ద కానీ, లేదంటే ఆమె ఇంటి వద్ద కానీ హడావుడి ఉటుంది కదా అని కరెక్ట్ లాజిక్ తీశారు. అంతేకాదు, ఆమె మృతదేహాన్ని ఏ ఒక్క మీడియా కి చూపించకపోవడం పై అనుమానాన్ని వ్యక్తం చేశారు.
పూనమ్ కి ఆర్జీవీ ప్రశంశ : RGV Praised Poonam
ఇక పూనమ్ చేసిన ఈ పనికి అంతా ఆమెను తప్పుబడుతుందట ఆర్జీవీ(RGV) మాత్రం ఆమెకు వత్తాసు పలికాడు. ఆమె కల్పిత కధనం వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని కానీ, ఆమె సాధించిన దాన్ని మాత్రం ఎవ్వరు ప్రశ్నించలేరన్నారు. అంతటితో ఆగకుండా నీలాగే నీ మనసు కూడా చాలా అందమైంది అని ప్రశంసించాడు ఆర్జీవీ.