కాంట్రవర్సీ క్వీన్ బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (poonam pandey)మరణించింది. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (cervical cancer)తో పూన్ పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 32 ఏళ్లు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చనిపోయినట్లు పూనమ్ మేనేజర్ మీడియాకు సమాచారం అందించారు. పూనమ్ చనిపోయిన విషయాన్ని శుక్రవారం ఉదయం అమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరులు ఓ పోస్ట్ ద్వారా తెలియజేశారు. చిన్నవయసులోనే పూనమ్ మరణించిందన్న వార్త తెలుసుకుని ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.
Poonam died of cervical cancer : గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ మృతి
ఆమె మరణ వార్త గురించి పూనమ్ పాండే (poonam pandey)పీఆర్ టీమ్ ఇలా చెప్పింది..” ఈ ఉదయం మాకెంతో కఠినమైంది. మాకెంతో ఇష్టమైన నటి పూనమ్ పాండే చనిపోయింది. ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఆమె ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారు. ఆమె లేని ఈ దుఃఖ సమయంలో, ఈ విషయాన్ని మీకు తెలిపేందుకు ఎంతో చింతిస్తున్నాము. ఆమె పంచిన ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం” అని ఆమె టీం ఓ మెసేజ్ పోస్ట్ షేర్ చేసింది. అయితే పూనమ్ చనిపోయిందన్న వార్తను ఆమె ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇది ప్రాంక్ అని భావిస్తున్నారు.
Famous for controversial posts వివాదస్పద పోస్టులతో ఫేమస్
పూనమ్ పాండే (poonam pandey) మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్ తో 2013లో ‘నషా’(Nasha)మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో పలు రొమాంటిక్ సినిమాల్లో నటించింది. సినిమాల్లోనే కాదు బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్ (Lockup)ఫస్ట్ సీజన్‌లో పూనమ్ పాల్గొంది. 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ (OD World Cup Tournament) సందర్భంగా పూనమ్ చేసిన ఓ ప్రకటనతో చాలా ఫేమస్ అయ్యింది. అంతే కాదు ఆమె మ్యారేజ్ లైఫ్ కూడా వివాదాస్పదమైంది. ఒకానొక సందర్భంతో తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను కూడా ఆశ్రయించి వార్తల్లో హైలెట్ అయ్యింది పూనమ్. ఆ తర్వాత పూనమ్ తన భర్త నుంచి డివోర్స్ తీసుకుంది. పూనమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వివాదస్పద పోస్టులతో నూ నిత్యం వార్తల్లో ఉండేది.